21 నుంచి మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూ

New Menu From 21st January In Mid Day Meal Says Adimulapu Suresh - Sakshi

విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

వివరాలు వెల్లడించిన మంత్రి ఆదిమూలపు

సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పైచిలుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఈనెల 21 నుంచి నూతన మెనూ అమలవుతుందని వెల్లడించారు. అన్నిచోట్ల ఒకే రకమైన నాణ్యత, రుచి ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

మధ్యాహ్న భోజన పథకం అమలులో నాలుగు అంచెలుగా తనిఖీలు ఉంటాయని మంత్రి తెలిపారు. తల్లిదండ్రుల కమిటీ, గ్రామ సచివాలయ సిబ్బంది, సెర్ప్‌ నుంచి తనిఖీలు ఉంటాయని అన్నారు. నాడు-నేడు, జగనన్న మధ్యాహ్న భోజన పథకం, మౌలిక వసతుల కల్పన ప్రతిష్టాత్మకంగా చేపడుతామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పులిహోరా,కిచిడి, వేరుశనగ చిక్కీ, గుడ్డు వంటి పౌష్టికాహారం అందిస్తామని మంత్రి అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top