రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారు: దత్తాత్రేయ | Bandaru Dattatreya criticised Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారు: దత్తాత్రేయ

Dec 17 2017 2:38 PM | Updated on Aug 15 2018 9:40 PM

Bandaru Dattatreya criticised Rahul Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కానీ బీజేపీ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు మాత్రం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నావలాంటిదని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వస్తున్న ప్రజాదరణను రాహుల్ జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. మరోవైపు తెలంగాణలో బీసీలకు సీఎం కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధులు కేటాయించాలని, ఉద్యోగాల భర్తీలోనూ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement