ప్రభాకర్‌చౌదరికి బలిజల షాక్‌ | Balija Association Shock to Prabhakar Chaudhary | Sakshi
Sakshi News home page

ప్రభాకర్‌చౌదరికి బలిజల షాక్‌

Mar 8 2019 12:25 PM | Updated on Mar 10 2019 9:05 PM

Balija Association Shock to Prabhakar Chaudhary - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న బళ్లారి వెంకట్రాముడు

అనంతపురం కల్చరల్‌: ఎమ్మెల్యే ప్రభాకర చౌదరికి సీటిస్తే టీడీపీలో ఉన్న బలిజ నాయకులందరూ మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమని రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు బళ్లారి వెంకట్రాముడు హెచ్చరించారు. గురువారం సాయంత్రం బాలాజీ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తనకు మళ్లీ సీటొచ్చినట్లు ప్రచారం చేసుకోవడాన్ని బలిజ సంఘం నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఇంత నిరంకుశంగా ఉంటూ అందరూ వ్యతిరేకిస్తుంటే  ఇంకా సీటొస్తుందని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికే డాక్టర్‌ మునిరత్నం అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా బలంగా ఉన్న సామాజిక వర్గాన్ని విస్మరిస్తే గుణపాఠం చెప్పితీరుతామన్నారు. ఈసారి కచ్చితంగా బలిజ అభ్యర్ధిని ఎమ్మెల్యేగా చూస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వెంకటరత్నం, ఘంటా సతీష్, లక్ష్మీనారాయణ, రామశేషయ్య, రాజేష్, దినేష్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement