వైఎస్సార్‌సీపీలోకి అయ్యన్న సోదరుడు | Ayyanna Patrudu Brother Joining in YSRCP Visakhapatnam | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి అయ్యన్న సోదరుడు

Nov 4 2019 12:41 PM | Updated on Nov 9 2019 1:12 PM

Ayyanna Patrudu Brother Joining in YSRCP Visakhapatnam - Sakshi

అనుయాయులతో మాట్లాడుతున్న సన్యాసిపాత్రుడు

నర్సీపట్నం: టీడీపీకి చెందిన మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ చింతకాయల అనిత, వైఎస్‌ చైర్మన్‌ సన్యాసిపాత్రుడు, పలువురు కౌన్సిలర్లు సోమవారం అమరావతిలో సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ సమక్షంలో పార్టీలో చేరేందుకు  వీరు ఆదివారం ప్రత్యేక వాహనాల్లో అమరావతి బయలుదేరి వెళ్లారు. మాజీ మంత్రి అయ్యన్నకు ఇంతకాలం వెన్ను దన్నుగా ఉన్న ఒకే ఒక్క సోదరుడు సన్యాసిపాత్రుడు ఇప్పుడు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. 20 వాహనాల్లో అట్టహాసంగా మాజీ కౌన్సిలర్లు చెరుకూరి సత్యనారాయణ, సూపర్‌ కౌన్సిలర్లు మాకిరెడ్డి అప్పారావు, మామిడి శ్రీనువాసరావు, చిటికెల కన్నబాబు, మళ్ల గణేష్,  టీడీపీకి చెందిన హౌసింగ్‌ బోర్డు  మాజీ డైరెక్టర్‌ రుత్తల చినరమణ, లంక శివకుమార్‌ తరలివెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement