‘ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదు’

Avanti Srinivas Fires On Vizag Land Occupiers - Sakshi

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో జరిగిన భూకుంభ కోణంలో ప్రమేయమున్న ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. భారీ స్థాయిలో ల్యాండ్‌ ట్యాంపరింగ్‌ జరిగిందని, ఈ కుంభకోణంలో టీడీపీ నేతలే ఎక్కువ ఉన్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై సిట్‌ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుందని మంత్రి వెల్లడించారు. సిట్‌ విచారణ ప్రజలకు నమ్మకం కలిగేలా పారదర్మకంగా ఉంటుందని తెలిపారు. ఇది కక్ష సాధింపు చర్యలు కావని స్పష్టం చేశారు. 

టీడీపీ హయాంలో సిట్‌ వేసినప్పడు బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎవరైతే దోషులుగా ఉన్నారో వారే ఇప్పుడు సిట్‌ను స్వాగతిస్తున్నామని అంటున్నారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. మద్యం పాలసీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని,  ఈ నేపథ్యంలో బయట రాష్టం నుంచి కూడా మద్యం రాకుండా కట్టడి చేస్తామని మంత్రి తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top