'ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా'

Avanthi Srinivas Comments About Pawan Kalyan - Sakshi

సాక్షి, విశాఖపట్నం : పవన్‌ కల్యాణ్‌వి అవకాశవాద రాజకీయాలని, ఆయన నిలకడ లేని వ్యక్తి అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా అని, దీనిలో భాగంగానే పవన్‌ కల్యాణ్‌ బీజేపీలో జాయిన్‌ అయ్యారని విమర్శించారు. చంద్రబాబుకు తనకంటూ ఏ విధానం లేదని, అందుకే దొడ్డి దారిన కొంతమందిని బీజేపీలోకి పంపిస్తున్నారు. బీజేపీలో జాయిన్‌ అయిన వాళ్లు వైఎస్‌ జగన్‌ మీద పడి ఏడ్వడం కంటే ఏపీ అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని హితభోద చేశారు. జగన్‌ మీద కక్షతో వేరే పా​ర్టీలో జాయిన్‌ అవడం వల్ల పవన్‌ సాధించింది ఏమి లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైఎస్సార్‌ పార్టీ అన్ని విధాలుగా విఫలమైందని పవన్‌ ఏ విధంగా చెబుతున్నారంటూ అవంతి ప్రశ్నించారు.కాగా సీఎం వైఎస్‌ జగన్‌ తానిచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రజలంతా జగన్‌ పక్షానే ఉన్నారని, రానున్న స్థానిక​ సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని అవంతి ధీమా వ్యక్తం చేశారు. 
(పవన్‌ కల్యాణ్‌పై కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు)

(‘పవన్‌ కల్యాణ్‌ అలా చేసి ఉండాల్సింది’ )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top