కాంగ్రెస్‌, బీజేపీలపై నిప్పులు చెరిగిన ఒవైసీ

Asaduddin Owaisi Said Congress Cannot Be Revived Even With Calcium Injection - Sakshi

ముంబై: దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని.. కాల్షియం ఇంజెక్షన్‌ ఇచ్చినా.. ప్రయోజనం ఉండదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీలో జవసత్వాలు పూర్తిగా నశించాయి. అందుకే ఆ పార్టీ మహారాష్ట్ర, హరియాణ అసెంబ్లీ ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకీ కాల్షీయం ఇంజెక్షన్‌లు ఇచ్చినా దండగే’ అని ఒవైసీ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో బీజేపీపై కూడా అసదుద్దీన్‌ విమర్శల వర్షం కురిపించారు.

ఇక మీదట ఎవరైనా వ్యక్తి మతం మార్చుకోవాలంటే.. నెల రోజుల ముందుగా నోటీసులు ఇవ్వాల్సిందేనంటూ హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం నూతన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒవైసీ దీనిని ఉంటకిస్తూ.. హిమాచల్‌కు మాత్రమే పరిమితమైన ఈ బిల్లును మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేయడం కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో రెండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top