దమ్ముంటే నాపై పోటీ చేయండి | Asaduddin Owaisi Challenge To BJP And Congress | Sakshi
Sakshi News home page

దమ్ముంటే నాపై పోటీ చేయండి

Nov 1 2018 9:20 AM | Updated on Mar 18 2019 9:02 PM

Asaduddin Owaisi Challenge To BJP And Congress - Sakshi

హకీంపేట్‌ సాలార్‌ బ్రిడ్జి వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న అసదుద్దీన్‌ ఒవైసీ

గోల్కొండ: బీజేపి, కాంగ్రెస్‌ నాయకులకు దమ్ముంటే తనతో పోటీ చేయాలని మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంíపీ అసదుద్దీన్‌ ఒవైసి సవాల్‌ విసిరారు. బుధవారం హకీంపేట్‌ సాలార్‌ బ్రిడ్జి చౌరస్తా వద్ద జరిగిన మజ్లిస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... దేశాన్ని ఆర్థికంగా బలహీనవర్చడంలో మోదీదే ప్రధాన బాధ్యత అని ఆయన అన్నారు.  ముస్లింల వెనుకబాటు తనానికి కారణం కాంగ్రెస్‌ పార్టీ కారణమని ఆయన అన్నారు. రాముడు పేరు మీద బీజేపి ప్రజలను మోసం చేస్తున్నదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మైనార్టీలు, పేద బడుగు వారు నష్టపోతారని ఆయన అన్నారు. 

బీజేపి, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని, మజ్లిస్‌ తాను చేసిన అభివృద్ధి పనులను చూసి ఓటు అడుగుతుందని ఆయన అన్నారు. కార్వాన్‌ నియోజకవర్గంలో మజ్లిస్‌ అభ్యర్థి, తాజా, మాజీ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, మరో సారి మజ్లిస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మజ్లిస్‌ అభ్యర్థి కౌసర్‌తో పాటు కార్పొరేటర్లు నసీరుద్దీన్, రాజేందర్‌ యాదవ్, నాయకులు పాషాభాయ్, యామిన్‌ఖాన్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement