‘సీఎం కేసీఆర్‌కు సిగ్గు, శరం ఉంటే..’ | Anjan Kumar Yadav Slams CM KCR | Sakshi
Sakshi News home page

‘సీఎం కేసీఆర్‌కు సిగ్గు, శరం ఉంటే..’

Jun 1 2018 2:30 PM | Updated on Sep 19 2019 8:44 PM

Anjan Kumar Yadav Slams CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తనపై నమ్మకంతో కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌ నగర అధ్యక్షుడిగా నియమించినందుకు ఉత్తమ​ కుమార్‌ రెడ్డికి మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ నాయకులు కృషి చేశారన్న అంజన్‌ కుమార్‌.. సీఎం కేసీఆర్‌కు సిగ్గు, శరం ఉంటే కాంగ్రెస్‌ నేతలకు సన్మానం చేయాలని సూచించారు. ఇంకా చెప్పాలంటే సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రావడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌తో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 99 కార్పొరేట్‌ సీట్లు గెలిచారని ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్‌లపై ప్రజలకు నమ్మకం పోయిందని, నగరమంతా త్వరలో పాదయాత్ర చేస్తానన్నారు. కేసీఆర్ చెప్పకముందే అన్ని కులాలకు ముందే కుల సంఘాలు ఉన్నాయని.. కులాల ప్రకారం తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను కేసీఆర్‌ గందర గోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. నాంపల్లి నుండి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీతో వేలమందితో గాంధీ భవన్‌ వెళ్లి అక్కడ సభ నిర్వహిస్తామన్నారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తానని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని హామీలిచ్చి కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌కు పాపం తగులుతుందన్నారు అంజన్‌ కుమార్‌ యాదవ్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement