పలుచోట్ల కౌంటింగ్‌కు అంతరాయం..!

Andhra Pradesh Election Results Technical Issues While Counting - Sakshi

సాక్షి, అమరావతి : సాంకేతిక సమస్యల కారణంగా పలు ప్రాంతాల్లో కౌంటింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప, రైల్వే కోడూరు, చిలకలూరి పేట, నూజివీడు రిటర్నింగ్‌ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే కమాండ్ కంట్రోల్‌ని సంప్రదించాలని సూచించారు.  ఏ కారణంతోను కౌంటింగ్ ఆపొద్దని, రూల్ బుక్ అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు ఈసీ నిర్దిష్ట పరిష్కారాలు  సూచించిందని వెల్లడించారు.  సందేహాలను నివృత్తి చేసుకోడానికి రూల్ పొజిషన్ చెక్ చేసుకోవాలని సూచించారు.
(ఏపీ అసెంబ్లీ ఫలితాలు: లైవ్‌ అప్‌డేట్స్‌ )

ఇక భీమవరం కౌంటింగ్‌ కేంద్రం వద్ద జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సమాచారశాఖ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు ఇన్‌టైమ్‌లో వెల్లడించడం లేదని మీడియా ప్రతినిదులు ఆరోపించారు. అంతకుముందు టిఫిన్ లేదంటూ కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఏజెంట్లు  ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క ఏజెంట్ నుండి 400 వసూలు చేసిన అధికారులు సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. ఇక ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమెన ఆదిక్యం కనబరుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ 140కి పైగా అసెంబ్లీ, 13 లోక్‌సభ స్థానాల్లో ఆదిక్యంలో ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top