రాహుల్‌ కౌగిలింత : అమూల్‌ కూడా వదిలిపెట్టలేదు..

Amul Features Rahul Impromptu Hug To PM Modi, Twitterati Praise - Sakshi

న్యూఢిల్లీ : కౌగిలింత... కన్ను కొట్టడం.. వంటి సరదా సన్నివేశాలతో సీరియస్‌గా జరిగే పార్లమెంట్‌లో సైతం నవ్వులు పూశాయి. లోక్‌సభ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా...సీరియస్‌గా అప్పడి వరకు విమర్శలు ఎక్కు పెట్టిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ఒక్కసారిగా ప్రధాని దగ్గరకు వెళ్లి కౌగలించుకోవడం, ఆ తర్వాత వచ్చి కన్ను గీటడం హాట్‌టాఫిక్‌గా మారింది. లోక్‌సభలో నిన్న జరిగిన ఈ డ్రామాటిక్‌ సీన్లపై ఇప్పటికీ ట్విటర్‌ మారుమోగిపోతోంది. న్యూస్‌పేపర్లు సైతం రాహుల్‌ కౌగిలింత సీన్‌ను ఫ్రంట్‌ పేజీలో ప్రచురించాయి. ఇలా అనూహ్యమైన పరిణామాలు జరిగినప్పుడు డయిరీ కో-ఆపరేటివ్‌ అమూల్‌ ఏమైనా చూస్తూ ఊరుకుంటోందా? తాను కూడా నాలుగు సెటైర్లు వేసి, నెటిజన్లను మరింత మురిపిస్తూ ఉంటోంది. ఇదే విధంగా నిన్న లోక్‌సభలో జరిగిన రాహుల్‌ గాంధీ కౌగిలింత సీన్‌పై కూడా ఓ సెటైరికల్‌ ఫీచర్‌ను వేసింది. 

రాహుల్‌, మోదీని కౌగిలించుకోవడాన్ని ఉట్టంకిస్తూ.. ‘ఆలింగనంగా ఉందా లేదా ఇబ్బంది కరంగా ఉందా’ అంటూ ఓ పిక్చర్‌ను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఆ పిక్చర్‌లోనే రాహుల్‌ గాంధీ కన్ను కొట్టడాన్ని కూడా స్కెచ్‌ చేసింది. నిన్న జరిగిన సెషన్‌లో ప్రధానిని కౌగలించుకోవడంతో పాటు రాహుల్‌ కన్ను గీటడం కూడా దేశమంతా ఆశ్చర్యం వ్యక్తం చేసేలా చేసింది. కాగ, 126:325 తేడాతో అవిశ్వాసం వీగిన సంగతి తెలిసిందే. కరెంట్‌ టాఫిక్స్‌తో అమూల్‌ విడుదల చేస్తున్న ఈ క్రియేటివ్‌ పిక్చర్స్‌ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సెటైరికల్‌ పిక్చర్‌ సైతం నెటిజన్లను ఆకట్టుకుంది. చాలా మంది నెటిజన్లు అమూల్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ‘కరెంట్‌ హాట్‌టాపిక్స్‌తో వ్యంగ్యమైన పిక్చర్స్‌ను రూపొందించడంలో అమూల్‌ నీవు చాలా బెస్ట్‌’ అంటూ ఓ యూజర్‌ ట్వీట్‌ చేశారు. అందుకే అమూల్‌ టేస్ట్‌ ఆఫ్‌ ఇండియా అంటూ మరో యూజర్‌ పేర్కొంది. ప్రతేడాది భలే ఐడియా వస్తుంది అంటూ అమూల్‌పై నెటిజన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top