బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి: కృష్ణయ్య | 50% Tickets to BCs: Krishnaiah | Sakshi
Sakshi News home page

బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి: కృష్ణయ్య

Mar 4 2018 5:12 AM | Updated on May 24 2018 3:02 PM

50% Tickets to BCs: Krishnaiah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన బీసీ సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. జనాభాలో సగభాగం బీసీలున్నారని, వారి ఓట్లతోనే ఏ పార్టీకైనా అధికారం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రలోభాల రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకపై బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకే ఓట్లు పడతాయన్నారు. ఇప్పటివరకు పార్లమెంటులో బీసీలకు సముచిత న్యాయం జరగలేదని.. వందల కులాలకు ప్రాతినిధ్యం దక్కలేదని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement