హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇటీవలే విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ ది ఒడిస్సీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఇండియాలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాకు సైతం భారత్‌లో భారీ క్రేజ్ నెలకొంది. ప్రత్యేక ప్రమోషన్స్ లేకుండానే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు కొల్లగొడుతోంది.
ఇండియాలో ఈ సినిమా తొలి రోజే రూ.30 నుంచి 50 కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో గంటకు సుమారు 25 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి. ప్రీ-సేల్స్‌లో ఇప్పటికే 1 మిలియన్‌కు పైగా టికెట్లు విక్రయించినట్లు సమాచారం. ఈ జోరు చూస్తుంటే ఇండియన్ మార్కెట్‌లో భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పైడర్ మ్యాన్ క్రేజ్ చూస్తుంటే కొత్తగా విడుదలవుతున్న సినిమాల కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఎక్కువగా ఉందనిపిస్తోంది. కాగా.. స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఈ గురువారం జూలై 30న థియేటర్లలో విడుదల కానుంది.


