బాధ్యతగా ఓటేశారు

2018 Telangana Legislative Assembly election - Sakshi

తరలివచ్చిన సినీతారలు, క్రీడాకారులు

ఓటు హక్కు వినియోగించుకున్న నేతలు

నగరంలోనే ఓటేసిన గవర్నర్, డీజీపీ, సీఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖులు, రాజకీయ నాయకులు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా సినీతారలు, క్రీడాకారులు ఉదయాన్నే పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్నారు. ఓటేసిన తరువాత అందరూ తప్పకుండా ఓటేయాలని మీడి యా ద్వారా తమ అభిమానులకు పిలుపునిచ్చారు.  

చింతమడకలో కేసీఆర్‌..
మరోవైపు రాజకీయ నేతల్లో అధికశాతం తాము పోటీ చేస్తోన్న సీట్లలో కాకుండా మరో చోట ఓటువేయడం గమనార్హం. సీఎం కేసీఆర్‌ దంపతులు సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామం లో ఓటు వేశారు. మంత్రి హరీశ్‌రావు దంపతులు సిద్దిపేటలో ఓటేశారు. మంత్రి కేటీఆర్‌ బంజారాహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ఆజంపురాలో, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ స్టార్‌ క్యాం పెయినర్‌ విజయశాంతి (బంజారాహిల్స్‌), జైపాల్‌రెడ్డి (జూబ్లీహిల్స్‌), వి.హనుమంతరావు (అంబర్‌పేట) కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నల్లగొండలో ఓటేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ (చిక్కడపల్లి), కిషన్‌రెడ్డి (కాచిగూడ), ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ (రాజేంద్రనగర్‌), టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ (జగిత్యాల), టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం (తార్నాక), సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి (శేరిలింగంపల్లి), సీపీఐ కేంద్ర కార్యదర్శి నారాయణ (హిమాయత్‌నగర్‌), సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి (హుస్నాబాద్‌), ప్రజాగాయకుడు గద్దర్‌ (అల్వాల్‌) ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలో నిలుచుని ఓటు వేశారు.

ఉన్నతాధికారులు
గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు (ఎంఎస్‌ మక్తా), ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి (ప్రశాసన్‌నగర్‌), తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి (కుందన్‌బాగ్‌), ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ దంపతులు (ఖైరతాబాద్‌)లు నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మనోహర్‌– సుజాత దంపతులు (వరంగల్‌లో) ఓటేశారు.

సినీతారలు సైతం..
కృష్ణ–విజయనిర్మల, చిరంజీవి–సురేఖ, నాగార్జున–అమల, వెంకటేశ్, నిర్మాత సురేశ్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ దంపతులు, ఆయన తల్లి శాలిని, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రాణా, గోపీచంద్, రాజమౌళి దంపతులు, నితిన్, బండ్ల గణేశ్, రామ్‌ పోతినేని, శేఖర్‌ కమ్ముల, కోచ్‌ గోపీచంద్, పీవీ సింధు, సానియా మీర్జా, వందేమాతరం శ్రీనివాస్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, తొట్టెంపూడి వేణు, మంచులక్ష్మి, జగపతిబాబు, ఆర్పీ పట్నాయక్, వరుణ్‌తేజ్, నాగబాబు, చార్మి, శ్రీకాంత్‌–ఊహ, బ్రహ్మాజీ, నిఖిల్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీను, సుమ, ఉపాసన, సమంత, ఝాన్సీ, రాఘవేంద్రరావు తదితర ప్రముఖులు హైదరాబాద్‌లో ఓటేశారు.

ఓటు వేసేందుకు వస్తున్న మహేశ్‌బాబు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top