
ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
సాక్షి, నూజివీడు : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. శోభనాపురం శివారు నుంచి గురువారం ఉదయం వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. వేలాది మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు జననేతతో కలిసి అడుగులేస్తున్నారు. అనంతరం ఈదర మీదుగా కొత్త ఈదర గ్రామం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది.