సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమా వేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం ఉంది.