హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో గురువారం రాత్రి నగరంలో తెలంగాణవాదుల సంబరాలు అంబరాన్నంటాయి.
హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో గురువారం రాత్రి నగరంలో తెలంగాణవాదుల సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అనేకమంది వీధుల్లోకొచ్చి ఆనందంతో మిఠాయిలు పంచిపెట్టి నృత్యాలు చేశారు. జెతైలంగాణ.. జైజై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఉద్యమకేంద్రం ఉస్మానియాలో విద్యార్థుల ఆనందం నింగినంటింది.