అన్నీ వివాదాలే? | All conflicts? | Sakshi
Sakshi News home page

అన్నీ వివాదాలే?

Feb 10 2015 12:56 AM | Updated on Sep 2 2017 9:02 PM

ఇరు రాష్ట్రాల మధ్య అన్నీ వివాదాలే. ఏదీ ఒక కొలిక్కి రాని పరిస్థితి. ఒకటి పరిష్కారమైతే మరొకటి!

ఇరు రాష్ట్రాల మధ్య అన్నీ వివాదాలే. ఏదీ ఒక కొలిక్కి రాని పరిస్థితి. ఒకటి పరిష్కారమైతే మరొకటి! ఇద్దరూ ఇద్దరే ఒకరిపై ఒకరు నిందా రోపణలు చేసుకోవడమే సరిపోతోంది! ఇలా చెప్పుకుంటూపోతే ప్రతీ విషయంలోనూ ఏదో ఒక అనిశ్చితి! మొన్నటి వరకూ విద్యుత్ తరు వాత శ్రీశైలం నీటి గొడవ, ఇంకా సద్దుమణగందే మళ్లీ తెరపైకి సాగర్ గేట్ల గొడవ, ఇదిలావుంటే మరోపక్క ఎంసెట్ గొడవ. ఇలా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం అధికారులకు పచ్చి వెలక్కాయ గొంతుకలో పడ్డ చందమైంది. మళ్లీ  వివాదం రాజ్‌భవన్ చేరడంతో ఇరు ప్రాంతాల వివాదాలు గవర్నర్‌కు తలనొప్పిగా మారాయి. ఏ గొడవ వచ్చినా, ఇరు రాష్ట్రాల నేతలు రాజ్‌భవన్ వెళ్లి ఒకళ్లపై ఒకళ్లు  ఫిర్యాదులు  చేసుకోవడం, టీవీలలో చూపిస్తున్నదే చూపిస్తూ, చూస్తున్న వాళ్లకు విసుగొచ్చేటట్లు అనిపిస్తున్నా మన  నేతలు గ్రహించడంలేదు. ఇరు ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా సయోధ్య దిశగా కృషి సాగడం లేదు. పైకి మాత్రం తెలుగువారందరూ ఒకటేనని ఊదరగొట్టడమే కానీ లోపల మాత్రం ప్రాంతీయ భేదాలు అలాగే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని సామ రస్యంగా పరిష్కరించకుంటే, వివాదాలు కొంతవరకూ సద్దుమణిగే అవకాశం ఉంటుంది. మరి ఆ శుభదినం ఎప్పుడు వస్తుందో మరి!

- శిష్ట్లా మురళీ సుధాకర్  చందానగర్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement