breaking news
resolution of disputes
-
కశ్మీర్‌పై ఐరాస తీర్మానాలు అమలు చేయాల్సిందే
ఇస్లామాబాద్: దక్షిణాసియాలో శాశ్వత శాంతి, భద్రత, స్థిరత్వం వంటివి కశ్మీర్ వివాద పరిష్కారంతో ముడిపడి ఉన్నాయని పాకిస్తాన్ స్పష్టంచేసింది. ఈ మేరకు పాక్ జాతీయ అసెంబ్లీలో మంగళవారం ఒక తీర్మానాన్ని ఆమోదించారు. కశ్మీర్ వ్యవహారాల మంత్రి అమీర్ ముఖామ్, కశ్మీర్‌పై పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ రాణా ముహమ్మద్ ఖాసిం నూన్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్ అచంచలమైన నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతును మరోసారి ప్రకటించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని రేడియో పాకిస్తాన్ వెల్లడించింది. కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాలను అమలు చేసేందుకు అర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితిని పాకిస్తాన్ కోరింది. కశ్మీర్ వివాదానికి న్యాయపరమైన, శాంతియుత పరిష్కారం లభించకుండా దక్షిణాసియాలో శాశ్వత శాంతి, స్థిరత్వం సాధించలేమని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి షరీఫ్ ఈ మేరకు సందేశం ఇచ్చారు. కాశ్మీరీ ప్రజలకు నైతిక, దౌత్యపరమైన, రాజకీయ మద్దతును కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. మరోవైపు జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు తమలో అంతర్భాగమని, వాటిని వేరు చేయలేమని భారత్ స్పష్టం చేసింది. -
అన్నీ వివాదాలే?
ఇరు రాష్ట్రాల మధ్య అన్నీ వివాదాలే. ఏదీ ఒక కొలిక్కి రాని పరిస్థితి. ఒకటి పరిష్కారమైతే మరొకటి! ఇద్దరూ ఇద్దరే ఒకరిపై ఒకరు నిందా రోపణలు చేసుకోవడమే సరిపోతోంది! ఇలా చెప్పుకుంటూపోతే ప్రతీ విషయంలోనూ ఏదో ఒక అనిశ్చితి! మొన్నటి వరకూ విద్యుత్ తరు వాత శ్రీశైలం నీటి గొడవ, ఇంకా సద్దుమణగందే మళ్లీ తెరపైకి సాగర్ గేట్ల గొడవ, ఇదిలావుంటే మరోపక్క ఎంసెట్ గొడవ. ఇలా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం అధికారులకు పచ్చి వెలక్కాయ గొంతుకలో పడ్డ చందమైంది. మళ్లీ వివాదం రాజ్‌భవన్ చేరడంతో ఇరు ప్రాంతాల వివాదాలు గవర్నర్‌కు తలనొప్పిగా మారాయి. ఏ గొడవ వచ్చినా, ఇరు రాష్ట్రాల నేతలు రాజ్‌భవన్ వెళ్లి ఒకళ్లపై ఒకళ్లు ఫిర్యాదులు చేసుకోవడం, టీవీలలో చూపిస్తున్నదే చూపిస్తూ, చూస్తున్న వాళ్లకు విసుగొచ్చేటట్లు అనిపిస్తున్నా మన నేతలు గ్రహించడంలేదు. ఇరు ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా సయోధ్య దిశగా కృషి సాగడం లేదు. పైకి మాత్రం తెలుగువారందరూ ఒకటేనని ఊదరగొట్టడమే కానీ లోపల మాత్రం ప్రాంతీయ భేదాలు అలాగే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని సామ రస్యంగా పరిష్కరించకుంటే, వివాదాలు కొంతవరకూ సద్దుమణిగే అవకాశం ఉంటుంది. మరి ఆ శుభదినం ఎప్పుడు వస్తుందో మరి! - శిష్ట్లా మురళీ సుధాకర్ చందానగర్, హైదరాబాద్


