‘తుడుపు’లో ఆటవిడుపు | Sakshi
Sakshi News home page

‘తుడుపు’లో ఆటవిడుపు

Published Wed, Feb 19 2014 2:01 AM

‘తుడుపు’లో ఆటవిడుపు - Sakshi

కొత్తవారు సైతం పాతుకుపోయిన రాజకీయ దిగ్గజాలను మట్టి కరిపించగలరన్న పాఠాన్ని కేజ్రీవాల్ భారతీయులకు నేర్పారు. కేజ్రీవాల్ కథలోని ఆఖరి అధ్యాయం రచన ఇంకా మొదలుకాలేదు. ఆసక్తికరమైన రోజులు ఇంకా ముందున్నాయి.
 
 డెబ్భై ఐదేళ్లకొకసారి హేలీ తోకచుక్క వచ్చి పోతూ ఉం టుంది. భూమి మీద నుంచి కూడా చూడగలిగే రీతిలో కాం తిని వెదజల్లి, మాయమైపోతుంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా రెండు మాసాలపాటు వెలుగులు చిమ్మారు. ఇప్పు డు ఆయన రాజకీయ భవితవ్యం ఏమిటో అంతుపట్టదు. కానీ భారత రాజకీయాల మీద ‘చీపురు’ వేసిన ముద్రను అంచనా వేయవచ్చు. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కాగల రని ఎవరూ ఊహించలేదు. ఆయన కోట్లకు పడగలెత్తిన వారుకాదు. రాజకీయ కుటుంబాల వారసు డూ కాదు. సంస్థాగతమైన యంత్రాంగం ఉన్న పార్టీ కూడా లేదు. అయినా, ప్రతిష్టాత్మ కమైన ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.
 
 ఐదేళ్ల పూర్తికాలం ఆయన ముఖ్యమంత్రి గా కొనసాగి ఉండవలసింది. కానీ సవాళ్లను ఎదుర్కొనడంలో కేజ్రీవాల్‌కున్న ఆసక్తి పదవి మీద లేదు. బీజేపీ, కాంగ్రెస్ తన రాజకీయ జీవితాన్ని అంతం చేయడానికి కంకణం కట్టు కున్న సంగతిని ఆయన అర్థం చేసుకున్నారు. రెండు పార్టీల వ్యవస్థ కొనసాగడానికి ఈ వ్యూ హం అనివార్యమని ఆ రెండు జాతీయ పార్టీలు భావిస్తున్నాయి కూడా. దీనిని ఛేదించడం కష్ట మన్న సంగతి ఆయనకు తెలియనిది కాదు. జాతీయ పార్టీలు తన మీద విమర్శలు మొదలుపెట్టడంతోనే కేజ్రీ వాల్ జాగరూకతతో మెలగడం మొదలుపెట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వ్యక్తిని మనం తక్కువ అంచనా వేయలేం. ఆయన వేసిన ప్రతి అడుగు వెనుక ఒక వ్యూహం ఉందని గుర్తుంచుకోవాలి.
 
 నలభైతొమ్మిది రోజుల నజరానా
 దేశ రాజధానిలో చిరకాలంగా పాతుకుపోయి ఉన్న వీఐపీ సంస్కృతికి ఆయన స్వస్తి పలికారు. ఆడంబరాలకూ, పటా టోపానికీ, భారీ కాన్వాయ్ సంస్కృతికీ దూరంగా ఉండ మని కేజ్రీవాల్ సహచరులకు నచ్చ చెప్పగలిగారు. తాను నిరాడంబరంగా ఉంటూ నమూనాగా నిలిచారు. దీనినే ఢిల్లీ వాసులు బాగా ప్రశంసిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొదటి వారంలోనే ముఖ్యమైన రెండు ఎన్నికల వాగ్దానాలను అమలుచేసి చూపారు. రోజుకు కుటుంబానికి 666 లీటర్ల నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యు త్ బిల్లులో సగం మొత్తాన్ని సబ్సిడీగా ప్రకటించారు.
 
  ముం దు నుంచీ ఈ వాగ్దానాల మీద సందేహాలు వ్యక్తం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లను అలా నోళ్లు మూయించారాయన. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆ రాష్ట్ర పరి ధిలో పని చెయ్యరు. ఆయన కేం ద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉంటారన్న సంగతి చాలా మం దికి తెలియదు. శాంతి భద్రత లకు సంబంధించి తనపై రాగల విమర్శలను కేజ్రీవాల్ ముందే ఊహించారు. ఈ అంశం మీద కేంద్ర హోంమంత్రి కార్యాల యంముందు ధర్నా చేశారు. ఒక ముఖ్యమంత్రి ఇలా ధర్నా చేయ డం మీద విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీ పోలీసు లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అజమా యిషీలో ఉండరన్న అంశాన్ని ప్రజలకు తేటతెల్లం చేయగలి గారు. ఢిల్లీ పోలీసుల అసమర్థత రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కాదని వెల్లడించగలిగారు. ఢిల్లీ పోలీసు ల మీద ఆగ్రహంతో ఉన్న ప్రజ లకు ఇది కూడా నచ్చింది.
 
 కేంద్రం మీద పోరాటం
 ప్రైవేట్ విద్యుత్ కంపెనీల అక్ర మాలను అరికడతానని కేజ్రీ వాల్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. విద్యుత్ కంపెనీలతో షీలాదీక్షిత్‌కు గల అక్రమ లావాదేవీల కారణంగానే బిల్లులు ఎక్కువగా ఉంటున్నాయని విమర్శించారు. ప్రైవేట్ విద్యు త్ కంపెనీల ఆర్థిక వ్యవహారాలపై కాగ్‌తో ఆడిట్ చేయిస్తా నని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఆ మేరకు ముఖ్యమంత్రి కాగానే కేజ్రీవాల్ కాగ్‌ను కలసి ఆడిట్ చేయాలని కోరారు. పెట్టుబడులపై 18 శాతం లాభాలను హామీ ఇస్తూ, కంపె నీల ఖర్చులపై ఆడిట్ చేయబోమని షీలాదీక్షిత్ రిలయన్స్ సహా పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. కంపె నీలన్నీ తమ ఖర్చుల్ని ఇష్టమొచ్చినంత చూపించుకు న్నాయి. దానిపై 18 శాతం లాభాలను వేసుకున్నాయి. ఖర్చుల్ని ఇష్టమొచ్చినట్లు చూపించి ప్రజల్ని కొల్లగొట్టుకో వడం కుదరదని కేజ్రీవాల్ అభ్యంతరం చెప్పారు.
 
 పెట్రోలియం మంత్రి వీరప్పమొయిలీ, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తదితరులపై దగా, మోసం అభియోగాలతో కేజ్రీవాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్యాస్ ధరలను పెంచేసి విద్యుత్ చార్జీలు పెరగడానికి కారకుల య్యారని వారిపై నేరారోపణ చేశారు. కొంత మంది పౌరస మాజ ప్రముఖులు తనకిచ్చిన వినతి పత్రంపై కేజ్రీవాల్ స్పం దించి పోలీసు కేసు పెట్టారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం సమంజసమేనని, ఫిర్యాదు సవ్యంగానే ఉందని వెల్లడయిం ది. దీనిపై స్టే తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకంజవే స్తోంది. ఈ విషయంలో జోక్యం చేసుకుంటే అవినీతిని సమర్థిం చినట్లవుతుందని కేంద్రం తటప టాయిస్తోంది.
 
 ఆమ్ ఆద్మీ మంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉండే వారు. ఆ మంత్రులు శక్తి మేరకు కష్టపడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. ఢిల్లీ శాసనసభ లోని 70 స్థానాలకూ ఆమ్ ఆద్మీ బలం 28 మాత్రమే! అందులో ముస్లిం ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు. కానీ గత 49 రోజులలో ముస్లిం మైనారిటీలు పెద్ద సంఖ్యలో కేజ్రీవాల్‌కు దగ్గరవుతూ వచ్చారు. దళితులలో ఆయనకు గల పునాది కూడా పటిష్టమవుతోంది. మద్దతు ఇస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ను ఖాతరు చేయకుండా విమర్శల దాడి కొనసాగిస్తున్నందుకు చాలా మంది కేజ్రీవాల్‌ను అభి నందిస్తున్నారు. ఢిల్లీలోనే కాక, ఇతర నగరాల్లో మైనారిటీ ఓట్లు కేజ్రీవాల్‌కు పడతాయని విశ్లేషకులు అంటున్నారు.
 
 కేజ్రీవాల్ ఒక జాతీయ స్థాయి హీరో అయ్యారు. ప్రజ లు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. కానీ రాజకీయ పార్టీలన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మాదిరిగా తయా రయ్యాయి. అందులో కొత్త వారికి ప్రవేశం ఉండదు. పార్టీ లకు గట్టి మద్దతుదారయినంత మాత్రాన, డబ్బు ఖర్చు చేసినంత మాత్రాన స్థానం లభించదు. అగ్రనేతల అను మతి లేకుండా కొత్తవారెవరూ పార్టీలో క్రియాశీలం కాలేరు.  కొత్త రాజకీయ సంస్కృతి నినాదంతో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సత్తా పార్టీ ఏర్పడింది. ఎన్నో ప్రయోగాలు చేసింది. కానీ బలం పుంజుకోలేకపోయింది. తలుపులు మూసిన దుకాణం మాదిరిగా మిగిలిపోయింది. కానీ కేజ్రీ వాల్ తన పార్టీకి బాహాటంగా తలుపులు తెరిచి ఉంచారు. ‘నేను సామాన్యుణ్ణి’ అని రాసి ఉన్న టోపీ ఉంటే చాలు, ఎవరైనా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అయిపోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున టీవీల్లో కనిపిస్తున్న అధికార ప్రతినిధులే డజన్లకొద్దీ ఉన్నారు. వారి మొహాల్లో తాజాదనం, యవ్వ నోత్సాహం తొణికిసలాడుతోంది. టోపీలు ధరించి  సౌమ్యంగా తియ్యగా మాట్లాడే వారి అమాయకపు ముఖా లు ప్రజలకు నచ్చుతున్నాయి.
 
 కేజ్రీవాల్ భవితవ్యం
 కేజ్రీవాల్ వంటి ఒక ఘటనాప్రపంచం ఆవిర్భవించగ లదని ఎవరూ అనుకోలేదు. తీరా కంటి ముందు కనిపించే సరికి అందరూ అయోమయంలో పడిపోయారు. దీన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయ పార్టీ పెడుతు న్నారని ఆయన ప్రకటించగానే కేజ్రీవాల్ పని అయిపోయి న ట్లేనని చాలామంది అనుకున్నందువల్లనే అన్నా హజారే పార్టీ ఏర్పాటుకు దూరమయ్యారు. ఆయన అదృష్టాన్నీ, నైపుణ్యాల్నీ అన్నా  కూడా సరిగ్గా అంచనా వేయలేకపో యారు. ఎన్నికల్లో గెలిచి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి అన్నాహజారే చాలా ఆగ్రహంగానూ, అసూయతోనూ వ్యవహరించారు. ఎంతో గడుసుతనం ఉన్న అన్నా కూడా మనసు మార్చుకున్నారు. జన్‌లోక్ పాల్ విషయంలో కేజ్రీవాల్ వైఖరికి తోడ్పాటు ఇచ్చారు.
 
2014 లోక్‌సభ ఎన్నికలు ఆమ్ ఆద్మీకి పరీక్ష వంటివి. దాంతో పాటే ఢిల్లీ శాసనసభ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఢిల్లీ శాసనసభలో కేజ్రీవాల్ తన సంఖ్యాబలాన్ని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు విషయానికి వచ్చేసరికి నగరాల్లో కేజ్రీవాల్, నరేంద్ర మోడీ మద్దతుదారులు ఒకరే. అందువల్ల పార్లమెంటు ఎన్నికల్లో కేజ్రీవాల్ గట్టి ఫలితాలు సాధించగల అవకాశాలు కనిపిం చడం లేదు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో సొంతంగా ప్రభు త్వం ఏర్పాటు చేయగలిగే సంఖ్యలో స్థానాలు పొందగలి గితే జాతీయస్థాయిలో ప్రధాన రాజకీయ పక్షాలకు కేజ్రీ వాల్ ఇబ్బందుల్ని సృష్టించగలరు. కొత్తవారు సైతం పాతు కుపోయిన రాజకీయ దిగ్గజాలను మట్టి కరిపించగలరన్న పాఠాన్ని కేజ్రీవాల్ భారతీయులకు నేర్పారు. కేజ్రీవాల్ కథలోని ఆఖరి అధ్యాయం రచన ఇంకా మొదలుకాలేదు. ఆసక్తికరమైన రోజులు ఇంకా ముందున్నాయి.    
 (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)
 - డా॥పెంటపాటి పుల్లారావు

Advertisement
 
Advertisement
 
Advertisement