కాలిఫోర్నియాలో వైఎస్సార్‌ సీపీ విజయోత్సవం | YSRCP Victory Celebration In California And Bay Area | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియా, బే ఏరియాలో వైఎస్సార్‌ సీపీ విజయోత్సవం

Jul 3 2019 2:36 PM | Updated on Jul 3 2019 2:48 PM

YSRCP Victory Celebration In California And Bay Area - Sakshi

కాలిఫోర్నియా : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా అమెరికా కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లో ఆ పార్టీ యూఎస్‌ఏ ఎన్‌ఆర్‌ఐ కమిటీ సభ్యులు ఆదివారం జూన్, ౩౦వ తేదీ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు కాలిఫోర్నియా పరిసర ప్రాంతాల్లోని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు భారీగా హాజరయ్యారు. దాదాపు 500 మంది సకుటుంబ సమేతంగా ఒకే వేదికను పంచుకోవడంతో ఈ సభ ఏపీలో జరుగుతున్నందనే అనుభూతినిచ్చింది. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు తెలుగుదనం ఉట్టిపడేలా చేసిన ఏర్పాట్లను చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమము ప్రారంభమైంది. తరువాత వైఎస్సార్‌ సీపీ అభిమానుల పెద్ద కార్ ర్యాలీ నిర్వహించారు. కాలిఫోర్నియా  ప్రముఖులు  డా. లక్కిరెడ్డి హనిమిరెడ్డి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్సార్‌ పాలనను మరిపించే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందించాలన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. బే ఏరియా వైఎస్సార్‌ సీపీ ప్రముఖులు గోపిరెడ్డి మాట్లాడుతూ.. ఈ విజయంలో ప్రతి ఒక్కరూ భాగమయ్యారు కాబట్టి ఇది ప్రజా విజయమని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో మళ్లీ "రాజన్న రాజ్యం" వచ్చి ప్రజలందరికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని ఆకాంక్షించారు. సమావేశానికి వచ్చిన వైఎస్సార్‌ సీపీ కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా బే ఏరియా  వైఎస్సార్‌ సీపీ ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్ చంద్రహాస్ పెద్దమల్లు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ సీపీ సాధించిన విజయం ప్రతి ఒక్క కార్యకర్త విజయమని అన్నారు. ఇంతటి అద్వితీయ విజయాన్ని అందించిన ఎన్‌ఆర్‌ఐ వైస్సార్‌ సీపీ అభిమానులకు,  కార్యకర్తలకు, సోషల్‌ మీడియా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌ కేవీ రెడ్డి సమావేశానికి వచ్చిన వైస్సార్సీపీ కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎన్‌ఆర్‌ఐ కమిటీ, ఇతర ఎన్‌ఆర్‌ఐ  వైఎస్సార్ అభిమానులు, గత 5  సంవత్సరాలుగా  పార్టీ పటిష్టతకు ఏ విధంగా కృషి చేశారో వివరించారు.  వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, తెలుగుదేశం వైఫల్యాలను ఎండగట్టటం, పార్టీ నవరత్నాలను ప్రచారం చేయడంలో ప్రధాన పాత్రవహిడం, పార్టీ శ్రేణుల సహకారంతో  రాష్ట్రంలో రివర్స్ ఆస్మాసిస్ వాటర్ ప్లాంట్స్ నెలకొల్పడం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, స్కూల్ పిల్లలకు పుస్తకాలు, మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇతర సేవా కార్యక్రమాలలో పాల్గొనడం, ఎన్నికల సందర్భంగా ‘ఎన్‌ఆర్‌ఐ  బస్సు యాత్ర '  లాంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుని వైఎస్సార్‌ సీపీ విజయానికి తమవంతు దోహదపడ్డ  ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ నినాదాలతో సభా ప్రాంగణం మారు మోగింది. అలాగే తమ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ క్షణం కోసం, "రాజన్న సుపరిపాలన కోసం" పార్టీ అభిమానులందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా ఎదురు చూశారని తెలిపారు. వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రానికి పరిశ్రమలు తరలి వస్తున్నాయని అందుకు కర్నూల్లో సిమెంట్ ప్లాంట్, విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉదాహరణలు మాత్రమే అని చెప్పారు. అలాగే వైఎస్‌ జగన్ వచ్చే ౩౦ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాక్షించారు.  

బే ఏరియా ఎన్‌ఆర్‌ఐ ప్రముఖలు సాధన, జార్జ్, గోపిరెడ్డి, డా. సూర్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి రామిరెడ్డి, డా. రామిరెడ్డి, ప్రముఖ ఫార్మసిస్ట్ మధు వంగ, ప్రసూన రెడ్డి (నాటా), నరేంద్ర కొత్తకోట(గాటా ), దీనబాబు( సిలికానాంధ్ర ) మొదలగువారు మాట్లాడుతూ  గత ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజలు మరిచిపోయేలా వైఎస్సార్‌ సీపీ పాలనలో సంక్షేమ ఫలాలు  ప్రజలందరికి  చేరుతాయని అన్నారు. వైఎస్సార్‌ సీపీ భవిష్యత్తులో మరిన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ సభ్యులందరికి యూఎస్‌ఏ కన్వీనర్స్‌ మధులిక, డా. వాసుదేవ రెడ్డి, రత్నాకర్ పండుగాయల, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు తమ వీడియో సందేశాలను పంపించారు.

ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్‌ సీపీ బే ఏరియా కమిటీ ముఖ్య సభ్యులు  సురేంద్ర అబ్బవరం, హరిప్రసాద్ మొయ్యి, కొండారెడ్డి, త్రిలోక్  ఆరవ, విజయ్ ఎద్దుల, శ్రీధర్ రెడ్డి తోట,  విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  సహదేవ్, నరేష్ కొండూరు, హరీంద్ర శీలం, శివా రెడ్డి , ప్రవీణ్, నరేంద్ర అట్టునూరి, సురేంద్ర పులగం, తిరు పేరం, సదాశివ మేకల, డా. రాఘవ, సునీల్, శేషాద్రి పోలిశెట్టి, ప్రేమ్ రెడ్డి, బాల నారాయణ రెడ్డి, సత్యనారాయణ బండారు, ధనిల్ రెడ్డి, శ్రీని కొండా, రమాకాంత్, చెన్నకేశవ, మూర్తి హరి, నరసింహ రావు, సూర్యనారాయణ రెడ్డి కురలి, నరసింహ యాదవ్, కిరణ్ కూచిబొట్ల, ఉమా కొండూరు, నీలిమ, సుగుణ, శైలజ రామిరెడ్డి , స్పందన, ప్రవీణ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు . నాటా, సిలికానాంధ్ర, బే ఏరియా ట్రై వాలీ తెలుగు అసోసియేషన్,  రామ్‌, మరియు ఇతర తెలుగు సంఘాలు, వైఎస్సార్‌ సీపీ యూఎస్‌ఏ స్టూడెంట్ విభాగం నేతలు విజయోత్సవ వేడుకలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన అందరికి  కేవీ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement