టీసీఏజీటీ ఆధ్వర్యంలో కూచుపూడి శిక్షణ శిబిరం | TCAGT conducts Kuchupudi Training in Canada | Sakshi
Sakshi News home page

టీసీఏజీటీ ఆధ్వర్యంలో కూచుపూడి శిక్షణ శిబిరం

Feb 26 2018 12:20 PM | Updated on Feb 26 2018 12:20 PM

TCAGT conducts Kuchupudi Training in Canada - Sakshi

టొరంటో :  ప్రముఖ నృత్య కళాకారుడు, డ్యాన్స్ మాస్టర్ కళారత్న కేవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కెనెడాలో కూచుపూడి శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. మార్చి 9 నుంచి 17 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఐదేళ్లు మించి ఆసక్తిగలవారు నమోదు చేసుకోవాలని తెలుగు సాంసృతిక సంఘం గ్రేటర్ టొరంటో (టీసీఏజీటీ) పేర్కొంది. తొలి సెషన్ లో భాగంగా కేవీ సత్యనారాయణతో మార్చి 19న  చిన్నారుల పరిచయకార్యక్రమం ఉంటుంది. హిందూ హెరిటేజ్ సెంటర్, 6300 మిస్సిసాగా రోడ్డు, కెనడాలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. మార్చి 10, 11న మథేసన్ బిఎల్వీడీ ఈస్ట్, మిస్సిసాగాలో, మార్చి 12, 15, 16న హిందూ హెరిటేజ్ సెంటర్, 6300 మిస్సిసాగా రోడ్డులో విద్యార్థులకు కూచుపూడి నాట్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ ముగింపు కార్యక్రమంలో భాగంగా మార్చి 17న విద్యార్థులు టీసీఏజీటీ ఉగాది వేడుకల్లో ప్రదర్శనను ఇవ్వనున్నట్టు టీసీఏజీటీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement