‘రాజన్న పాలన జగనన్నతో అవిష్కృతం’

RK Roja Met YSR Congress Party Singapore Committee - Sakshi

సింగపూర్‌: నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపి అలనాటి రాజన్న పాలనను, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ తెలుగు గడ్డ మీద అవిష్కృతం చేయడం తధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సింగపూర్‌ పర్యటన సందర్భంగా అక్కడి వైఎస్సార్‌ సీపీ నూతన కార్యవర్గ కమిటీతో ఆమె సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సింగపూర్‌లో వైఎస్సార్‌ సీపీ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఇలాగే ముందుకు వెళ్లాలని సూచించారు. సింగపూర్‌లో ఉండే పార్టీ అభిమానులు, ఎన్నారై నాయకులు ఎన్నికల సమయంలో స్వదేశానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు.. పార్టీ ప్రచారంలో పాల్గొనాలని ఆహ్వానించారు. 

ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం వైఎస్‌ జగన్‌కు ఇష్టం లేదని తెలిపారు. అలా చెప్పి ఉంటే ఆయన ఎప్పుడో అధికారంలోకి వచ్చేవారని.. కానీ అలా చేయడం ధర్మం కాదని వైఎస్‌ జగన్‌ చెపుతూ ఉంటారని రోజా గుర్తుచేశారు. పార్టీలోని మహిళలను వైఎస్‌ జగన్‌ సొంత చెల్లెల్లుగా చూసుకుంటారని అన్నారు. టీడీపీలో తను చాలా కాలం పనిచేశానని అక్కడ పనిమనిషిగా మాత్రమే చూశారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ సీఎం కావడమే తన లక్ష్యమని వెల్లడించారు. సింగపూర్‌ ఎన్నారై వైఎస్సార్‌ సీపీ కన్వీనర్లు బొమ్మారెడ్డి శ్రీనివాస్‌, జయప్రకాష్‌రెడ్డి, పృద్విరాజు నాయకత్వాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నూతన కార్యవర్గ సభ్యులతో పాటు భారీగా వైఎస్సార్‌ సీపీ అభిమానులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top