
సిడ్నీ : సిడ్నీ బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో అక్కడి వీధులు మార్మోగాయి. వేల మైళ్ల దూరంలో ఉంటున్నా.. తెలంగాణ ఎన్నారైల మనసుంతా తెలంగాణ పైనే ఉంటుందని సిడ్నీ బతుకమ్మ అధ్యక్షుడు అనిల్ మునగాల పేర్కొన్నారు. అందరూ ఒక్కచోట కూడి బతుకమ్మ పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని SBDF చైర్మన్ రామ్ రెడ్డి గుమ్మడవాలి తెలిపారు. ఈ బతుకమ్మ సంబురాల్లో సుమారు 1700 నుండి 2000 మంది వరకు పాల్గొన్నారు. తెలంగాణ జానపద గీతాలతో గోరెటి వెంకన్న మరియు జంగి రెడ్డి జనాలను ఉర్రూతలు ఊగించారు.ప్రవాస తెలంగాణవాసులే కాకుండా.. పంజాబీలు, చైనీయులు, తమిళులతో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన వారు కూడా పాల్గొని బతుకమ్మ వేడుకలు గొప్పగా ఉన్నాయని అభినందించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జూలియా ఫిన్ , హుగ్ మక్డ్రాట్, సూసై బెంజమిన్, ఇండియన్ హై కమిషన్ కార్యదర్శి ఎస్.కే. వర్మ బతుకమ్మ వేడుకల్లో విశిష్ట అతిథులుగా హాజరయ్యారు . ఈ బతుకమ్మ వేడుకలకు సమన్వయ కర్తలుగా రామ్ రెడ్డి గుమ్మడవాలి, సుమేషు రెడ్డి సూర్య, శశి మానేం, గోవెర్దన్ రెడ్డి, హారిక మానేం, కవిత రెడ్డి, ప్రశాంత్ కడపర్తి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సునీల్ కల్లూరి, మిథున్ లోక, వినయ్ యమా, ప్రదీప్ తెడ్ల, , అనిల్ మునగాల, సందీప్ మునగాల, హారిక మన్నెం, వాత్సహాల ముద్దం, కిశోరె రెడ్డి, నటరాజ్ వాసం, డేవిడ్ రాజు, ఇంద్రసేన్ రెడ్డి, పాపి రెడ్డి, నర్సింహా రెడ్డి, ప్రమోద్ రెడ్డి, వాసు టూట్కుర్, లతా కడపర్తి, సాయి కిరణ్ చిన్నబోయిన, ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల, వినోద్ ఏలేటి, వినయ్ కుమార్, కిశోరె యాదవ్, కిరణ్ అల్లూరి, పద్మిని చాడ, సంగీత కోట్ల, రాజేష్ అర్షణపల్లి, పాపి రెడ్డి, అశోక్ మాలిష్, ఇంద్రసేన్ రెడ్డి, ప్రమోద్ ఏలేటి, కావ్య గుమ్మడవాలి ఇతర సంఘాల అధ్యక్షలు తదితరులు పాల్గొన్నారు.
