ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన నాటా కమిటీ | NATA team invites YV Subbareddy for clelebration | Sakshi
Sakshi News home page

ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసిన నాటా కమిటీ

Dec 19 2017 7:01 PM | Updated on May 28 2018 1:52 PM

NATA team invites YV Subbareddy for clelebration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది జరగనున్న నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఉత్సవాలకు హాజరు కావాలసిందిగా వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఆహ్వానం అందింది. 2018 జూలై 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నాటా ఉత్సహాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నాటా కమిటీ మంగళవారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కలుసుకుంది. నాటా ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా నాటా బృందం విజ్ఞప్తి చేసింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఉత్సవాలకు ఆహ్వానించిన వారిలో నాటా అధ్యక్షులు జి.రాజేశ్వర్‌రెడ్డి, జి. రాఘవరెడ్డి (ఎలక్ట్), శ్రీదర్ కొర్రపాటి, ఆళ్ల రామిరెడ్డి, ద్వారక్ వారణాసి, ప్రతాప్, ప్రసాద్, ఎస్. నారాయణరెడ్డి, మనోహర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement