ఎన్‌ఆర్‌ఐ కుటుంబం మృతదేహాలు వెలికితీత | 3 dead bodys found of missing Indian family in Eel River | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐ కుటుంబం మృతదేహాలు వెలికితీత

Apr 17 2018 1:03 PM | Updated on Aug 24 2018 8:18 PM

3 dead bodys found of missing Indian family in  Eel River - Sakshi

కాలిఫోర్నియా : భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అమెరికాలో అదృశ్యమైన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన సందీప్‌ తోటపల్లి(41), ఆయన భార్య సౌమ్య(38), ఇద్దరు పిల్లలు సిద్ధాంత్(12), సాచి(9)లు పోర్ట్‌లాండ్‌ నుంచి శాన్‌జోష్‌ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న మెరూన్‌ హోండా పైలట్ కారు ప్రమాదవశాత్తూ ఈల్‌ నదిలో పడిపోయింది. సరదాగా గడిపేందుకు ఏప్రిల్‌ 6న బంధువు ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అప్పటి నుంచి వారి కోసం సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో గత వారం సందీప్‌ భార్య సౌమ్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికి తీశారు.

కాగా, సోమవారం మరో రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలు సందీప్‌ తోటపిల్లి, ఆయన కుమార్తె సాచివిగా సిబ్బంది గుర్తించారు. అయితే వారి కుమారుడు సిద్ధాంత్‌ ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. సందీప్‌, సాచిల మృతదేహాలు హోండా పైలట్‌ కారులోనే చిక్కుకుని ఉండగా బయటకు తీశారు. గల్లంతైన సిద్ధాంత్‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సందీప్‌ తల్లిదండ్రులు గుజరాత్‌లో ఉన్నారు. గుజరాత్‌లోనే పెరిగిన సందీప్‌ పదిహేనేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement