గిరిజన యువకుడిపై చిరుత దాడి | Cheetah attack on tribal youth | Sakshi
Sakshi News home page

గిరిజన యువకుడిపై చిరుత దాడి

Jan 15 2018 2:41 AM | Updated on Jul 30 2018 1:23 PM

Cheetah attack on tribal youth - Sakshi

ఖానాపూర్‌: నిర్మల్‌ జిల్లా పెంబి మండల కేంద్రంలోని అక్టోనిమాడ గ్రామ శివారులో దారుగు ఒర్రె ప్రాంతంలో గిరిజన యువకుడిపై శనివారం చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన ఆత్రం సంతోష్‌  గ్రామశివారులోని కంది చేనుకు కాపలా  కోసం శనివారం వెళ్లి ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తిరిగి వస్తున్నాడు.

మార్గ మధ్యంలో ఒక్కసారిగా అతనిపై చిరుత దాడిచేసింది. దీన్ని గమనించిన గిరిజనులు కేకలు వేయడంతో చిరుత పారిపోయింది. గాయపడిన సంతోష్‌ను పెంబి పీహెచ్‌సీకి తరలించారు. పారిపోయిన చిరుత ఒర్రె గట్టు గుహలు ఉన్న నెమలి చెట్టు తొర్రలో నక్కింది. గమనించిన స్థానికులు అరవడంతో అక్కడి నుంచి పారిపోయి ముళ్ల పొదలపై రోజంతా గడిపింది. చిరుతను పట్టుకునేందుకు అటవీ, వైల్డ్‌ లైఫ్‌ అధికారులు రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement