హిజ్రాగా పరిచయం చేసుకుని అత్యాచారం | Youth, who posed as eunuch, rapes woman, | Sakshi
Sakshi News home page

హిజ్రాగా పరిచయం చేసుకుని అత్యాచారం

Jul 12 2014 10:12 PM | Updated on Jul 28 2018 8:51 PM

హిజ్రాగా పరిచయం చేసుకుని అత్యాచారం - Sakshi

హిజ్రాగా పరిచయం చేసుకుని అత్యాచారం

ఓ యువకుడు తనను హిజ్రాగా పరిచయం చేసుకుని ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు.

న్యూఢిల్లీ: ఓ యువకుడు తనను హిజ్రాగా పరిచయం చేసుకుని ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆమెను తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీ మధ్య ప్రాంత్రంలో ఈ సంఘటన జరిగింది.

పశ్చిమబెంగాల్కు చెందిన 23 ఏళ్ల సోనూ.. ఒడిశా నుంచి వచ్చిన ఓ యువతిని రైల్వే స్టేషన్లో పరిచయం చేసుకున్నాడు. తనో హిజ్రానంటూ నమ్మపలికాడు. ఉద్యోగం ఇప్పిస్తానని తన అద్దెగదికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతను నేరం ఒప్పుకోవడంతో పాటు హిజ్రాగా వేషం వేసుకుని మోసాలకు పాల్పడుతుంటానని పోలీసుల విచారణలో వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement