మహిళ ఎంతెత్తుకైనా...ఎందాకైనా.... | woman's day special story for airindia lady's special aircraft record | Sakshi
Sakshi News home page

మహిళ ఎంతెత్తుకైనా...ఎందాకైనా....

Mar 8 2016 4:02 AM | Updated on Mar 3 2020 7:07 PM

మహిళ ఎంతెత్తుకైనా...ఎందాకైనా.... - Sakshi

మహిళ ఎంతెత్తుకైనా...ఎందాకైనా....

సాధారణంగా విమానాల్లో ఎయిర్ హోస్టెస్‌లు మాత్రమే మహిళలు ఉంటారు.

సాధారణంగా విమానాల్లో ఎయిర్ హోస్టెస్‌లు మాత్రమే మహిళలు ఉంటారు. కానీ, అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిరిండియా లేడీస్ స్పెషల్ విమానాన్ని నడిపింది. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదుగానీ.. ఈ విమానంలో మొత్తం అందరూ మహిళలే. కాక్‌పిట్ క్రూ.. కేబిన్ క్రూ.. చెక్ ఇన్ స్టాఫ్.. వైద్య బృందం.. కస్టమర్ కేర్ సిబ్బంది.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టీమ్.. గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్.. ఇలా అన్ని విభాగాలను అతివలే నిర్వర్తించడం ఈ ఫ్లైట్ స్పెషాలిటీ. అంతేకాదు.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో నగరానికి అంటే సుమారు 14 వేల కిలోమీటర్ల సుదూర ప్రయాణం చేసి రికార్డు సృష్టించింది.

ఈ నెల 6న ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ నాన్‌స్టాప్ ఫ్లైట్ గమ్యస్థానం చేరేందుకు సుమారు 17 గంటల సమయం పట్టింది. ఎయిరిండియా సీఎండీ అశ్వినీ లోహనీ దీనిని చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. మహిళా సిబ్బందితో సుదూర ప్రయాణం చేసిన విమానంగా ఇది రికార్డు సృష్టించిందన్నారు. - న్యూఢిల్లీ

Advertisement
 
Advertisement
Advertisement