బీచ్లో యువతి మృతదేహం కలకలం | Woman found dead on Goa beach Panaji, | Sakshi
Sakshi News home page

బీచ్లో యువతి మృతదేహం కలకలం

Jan 23 2016 12:41 PM | Updated on Sep 3 2017 4:10 PM

గోవాలోని ఒక పేరొందిన బీచ్ లో యువతి మృతదేహం కలకలం రేపింది.

పనాజి:   గోవాలోని   ఒక పేరొందిన బీచ్ లో యువతి మృతదేహం కలకలం  రేపింది.  ఉత్తర గోవాలోని అరంబాల్ బీచ్ లో అర్ధనగ్న స్థితిలో  పడివున్న  యువతి(20)  మృతదేహాన్ని గత రాత్రి కనుగొన్నామని శనివారం పోలీసులు  తెలిపారు.     భారతీయ యువతి అని, సుమారు ఇరవయ్యేళ్ల  వయసు ఉండొచ్చని సీనియర్ పోలీసు అధికారి దేవేంద్ర తెలిపారు. ఇంతకు మించి ఆ యువతికి సంబంధించిన ఆచూకీ తెలియడం లేదనన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అయితే   గురువారం రాత్రి ముగ్గురు అబ్బాయిలతో బీచ్ లో సంచరించినట్టు తమ ప్రాథమిక విచారణలో  తేలిందన్నారు.  వీరంతా బీచ్లో  పార్టీ  చేసుకున్నట్టు తెలుస్తోందన్నారు. అతిగా మద్యం సేవించిన అనంతరం  నీళ్లలో దిగి  చనిపోయి వుంటుందనే అనుమానాలను వ్యక్తం చేశారు.  మరణానికి గల  పూర్తి కారణాలు  ఇంకా తెలియాల్సి ఉందని  అధికారి చెప్పారు. యువతి మృతదేహాన్ని పోస్ట్మార్తం నిమిత్తం తరలించిన పోలీసులు.. ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement