హిజ్రా అన్నందుకు.. విడాకులు | Wife calls spouse 'hijra', court grants him divorce | Sakshi
Sakshi News home page

హిజ్రా అన్నందుకు.. విడాకులు

Sep 7 2014 3:48 PM | Updated on Jul 27 2018 2:18 PM

హిజ్రా అన్నందుకు.. విడాకులు - Sakshi

హిజ్రా అన్నందుకు.. విడాకులు

భార్య హిజ్రా అని తిట్టినందుకు ఓ భర్త, ఫ్యాన్ వేయనివ్వండూ మరో భార్య తమ జీవిత భాగస్వాములతో విడాకులు తీసుకున్నారు.

ముంబై: పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా దంపతులు చిన్నచిన్న కారణాలకే విడాకులు తీసుకునే సంస్కృతి భారత్లోనూ పెరిగిపోతోంది. భార్య హిజ్రా అని తిట్టినందుకు ఓ భర్త, ఫ్యాన్ వేయనివ్వండూ మరో భార్య తమ జీవిత భాగస్వాములతో విడాకులు తీసుకున్నారు. ఈ రెండు సంఘటనలు మహారాష్ట్రలో జరిగాయి.

మొదటి కేసుకు సంబంధించి ఓ వ్యక్తి 2011లో పెళ్లి చేసుకున్నాడు. కాగా తన భార్య ఇంటిపనులు చేయదని, ఎప్పుడూ శృంగారం కావాలని వేధిస్తుందని కోర్టులో చెప్పాడు. ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పినందుకు తన హిజ్రా అని తిట్టిందని వాపోయాడు. అంతేగాక, తనపైనా, కుటుంబ సభ్యులపైనా తప్పుడు కేసులు పెట్టిందని తెలిపాడు. తనను మానసికంగా వేధిస్తోందని, దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని కోర్టుకు విన్నవించాడు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.

మరో కేసులో ఓ యువతి తన భర్త వేసవిలో కూడా ఇంట్లో ఫ్యాన్ వేసుకోనివ్వడంటూ ఫిర్యాదు చేసింది. కరెంట్ బిల్లు పెరుగుతుందని అడ్డుకుంటాడని తెలిపింది. భర్తతో 14 ఏళ్ల వైవాహిక జీవితాన్ని తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడింది. కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. భార్యకు భరణంగా 10 లక్షల రూపాయిలు చెల్లించాలని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement