కరోనా ఒక ‘సంస్కరణ కర్త’ 

Venkaiah Naidu Says CoronaVirus Also Seen Be As A Corrector - Sakshi

 ప్రజల జీవన శైలిని సమూలంగా మార్చిందన్న వెంకయ్యనాయుడు

 కరోనా కాలంలో జీవిత పాఠాలు నేర్చుకున్నారా? అంటూ ప్రజలకు ప్రశ్న

 ఆత్మశోధన కోసం పది సూత్రాల మాతృకను సూచించిన ఉపరాష్ట్రపతి  

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బంధనం లో చిక్కుకుని గత కొన్ని నెలల కాలం లో మనం గడిపిన జీవితంపై ప్రజలం తా ఆత్మశోధన చేసుకోవాలని, ఈ సమయంలో సరైన జీవిత పాఠాలు నేర్చుకున్నామో లేదో తమకు తాముగా అం చనా వేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. అనూహ్య అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన సన్నద్ధతతో ఉన్నామా అన్నది తరచి చూసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. కోవిడ్‌–19కు కారణాలు, పర్యవసానాలపై ప్రజలతో తన భావనలు పంచుకునేందుకు వెంకయ్య నాయుడు ఫేస్‌బుక్‌ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.

‘కరోనా కాలంలో జీవిత భావనలు’అన్న శీర్షికతో ఆయన తన అభిప్రాయాలను సంభాషణా శైలిలో వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా పది ప్రశ్నలను సంధించారు. ‘ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలే పలు జీవిత పాఠాలను నేర్పుతాయి. కోవిడ్‌–19 సంక్షోభంతో ఇళ్లకే పరిమితమై గత 4 నెలల్లో నేర్చుకున్న జీవిత పాఠాలను, జీవితంలో మార్పులను మదింపు చేసుకునేందుకు ఈ ప్రశ్నలు దోహదపడతాయి. కరోనా మహమ్మారిని కేవలం ఒక వైపరీత్యంగా మాత్రమే పరిగణించరాదు, మన జీవనశైలిని సంస్కరించే ‘దిద్దుబాటుదారు’గా, ‘సంస్కరణ కర్త’గా చూడాల్సిన అవసరం ఉంది’అని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. 

ఆతృతకు తావులేకుండా..
ఎలాంటి ఆతృతకు తావులేని జీవనవిధానానికి ఆయన పలు సూచనలు చేశారు. సరైన ఆలోచన, జీవన విధానం, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ఆహారాన్ని ఔషధంగా పరిగణించడం, సామాజిక బంధంతో ఒక అర్థవంతమైన జీవన విధానాన్ని అలవరచుకోవడం వంటి సూచనలను పొందుపరిచారు. వైపరీత్యాలకు గల కారణాలను గురించి ప్రస్తావించారు. ‘మొత్తం భూగోళం మానవులకోసమే అన్నట్టుగా మనుషులు పెత్తనం చెలాయించడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది’ అని అన్నారు.  

తల్లిదండ్రుల, పెద్దల సంరక్షణలో తాము చేస్తున్న తప్పులేమిటో గుర్తించారని, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనడానికి సన్నద్ధమయ్యారని, ఇన్నాళ్లూ కోల్పోయిందేమిటో తాము ఇళ్లకే పరిమితమైనపుడు గుర్తించారన్నారు. ‘మనమంతా సమానులుగా పుట్టాం. కాలం గడుస్తున్న కొద్దీ చివరకు సమా నత్వంలో భేదాలు తలెత్తాయి. కొన్ని వర్గాల  కష్టాలను, కడగండ్ల తీవ్రతను ఈ మహమ్మారి ఎత్తిచూపింది’అని అభిప్రాయపడ్డారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

08-08-2020
Aug 08, 2020, 07:18 IST
చెన్నేకొత్తపల్లి: ఇష్టం లేని పెళ్లిని తప్పించుకునేందుకు ఓ యువకుడు తనకు కరోనా సోకిందంటూ ప్రచారం చేసుకున్నాడు. క్వారంటైన్‌లో ఉన్నానంటూ బంధువులకు...
08-08-2020
Aug 08, 2020, 05:09 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో ఆస్పత్రుల నుంచి 7,594 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనా నుంచి...
08-08-2020
Aug 08, 2020, 04:00 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో వైద్యం, ఇతర సంబంధిత సేవల కోసం 11,200 మంది సిబ్బందిని నియమిస్తున్నామని సీఎం...
08-08-2020
Aug 08, 2020, 03:52 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 మరణాలు తగ్గించడంలో భాగంగా సామాజిక ఆసుపత్రుల్లో కూడా (సీహెచ్‌సీ) ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం...
07-08-2020
Aug 07, 2020, 19:44 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 62,938 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,171 పాజిటివ్‌ కేసులు...
07-08-2020
Aug 07, 2020, 19:31 IST
సాక్షి, హైద‌రాబాద్‌: టాలీవుడ్‌కు క‌రోనా గండం ప‌ట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే దర్శ‌కుడు తేజ‌, ఆర్ఆర్ఆర్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, సింగ‌ర్ స్మిత‌ క‌రోనా బారిన...
07-08-2020
Aug 07, 2020, 18:02 IST
సాక్షి, అమరావతి : కరోనా నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్‌ దౌత్యాధికారులతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి...
07-08-2020
Aug 07, 2020, 17:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా (ఎస్‌ఐఐ) అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది....
07-08-2020
Aug 07, 2020, 16:50 IST
రెండు రోజుల క్రితమే మా సమీప బందువుకు కోవిడ్ సోకి చాలా సీరియస్ అయ్యింది.  వెంటనే నాకు తెలిసిన స్వామి నాయుడు...
07-08-2020
Aug 07, 2020, 14:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఏ కాల‌మైనా స‌రే, ఏ విప‌త్తులు వ‌చ్చినా స‌రే భార‌తీయులు వారి అల‌వాట్లు, ఇష్టాయిష్టాలు మార్చుకోలేరు. డ‌బ్బులు కూడ‌బెట్టి...
07-08-2020
Aug 07, 2020, 14:05 IST
సాక్షి, అమరావతి : కోవిడ్‌-19 నివారణా చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు....
07-08-2020
Aug 07, 2020, 13:43 IST
న్యూయార్క్‌: మహమ్మారి కరోనా వ్యాప్తి భయాల నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్ల కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ...
07-08-2020
Aug 07, 2020, 13:20 IST
రాజమహేంద్రవరం క్రైం: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు ఖైదీలు కరోనా బారిపడ్డారు. కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల...
07-08-2020
Aug 07, 2020, 12:53 IST
కోల్‌క‌తా :  కరోనా..సామ‌న్యుల నుంచి ఎంద‌రో ప్ర‌ముఖుల‌ను సైతం బ‌లితీసుకుంటుంది. తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ మాజీ మంత్రి శ్యామల్ చక్రవర్తి (76)...
07-08-2020
Aug 07, 2020, 11:36 IST
సిమ్లా: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో గ‌డిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గురువారం ఒక్క‌రోజే అత్య‌ధికంగా 131 మందికి...
07-08-2020
Aug 07, 2020, 11:22 IST
సాక్షి, అమరావతి : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
07-08-2020
Aug 07, 2020, 11:11 IST
కరోనా కేసులు 10 లక్షల మార్క్‌ దాటిన రోజు నుంచి వచ్చిన కొత్త కేసులలో దాదాపు 38 శాతం ఐదు రాష్ట్రాల...
07-08-2020
Aug 07, 2020, 10:52 IST
అంగస్తంభన సమస్యల నివారణ కోసం ఉపయోగించే ఆర్ఎల్‌ఎఫ్-100 (అవిప్టడిల్)తో కరోనా కట్టడి.
07-08-2020
Aug 07, 2020, 10:26 IST
కోవిడ్-19 కార‌ణంగా మొద‌టిసారిగా ఓ జ‌డ్జి క‌న్నుమూశారు.
07-08-2020
Aug 07, 2020, 10:10 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. రోజులు గుడుస్తున్నకొద్దీ మునుపెన్నడూ లేని విధంగా అధిక మొత్తంలో ​కేసులు వెలుగు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top