
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజల కు సరైన, అవసరమైన సమాచారాన్ని చేరవేస్తూ అనుక్షణం వారిని అప్రమత్తం చేయడంలో ప్రసారమాధ్యమాలు పోషించిన నిర్మాణాత్మక పాత్రను ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ‘కరోనాపై పోరులో ప్రసార మాధ్యమాల అసమాన పాత్ర’ పేరుతో ఆదివారం ఫేస్‌బుక్ వేదికగా విడుదల చేసిన వ్యాసంలో.. గతకొద్ది నెలలుగా వైరస్‌కు సంబం ధించిన ప్రతి అంశాన్ని ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరచడంలో.. జాగ్రత్తగా ఉండేందుకు ప్రభుత్వాలు చేసిన సూచనలను నిరంతరం ప్రజలకు చేరవేయడంలో మీడియా పోషించిన పాత్రను అభినందించారు. అలాగే పత్రికలు వైరస్ వాహకాలని మొదట్లో ప్ర చారం జరిగిందని, అదేమా త్రం వాస్తవం కాదన్నారు. ‘నేను రోజూ పత్రికలు చదువుతూనే ఉన్నాను’ అని ఆయన వెల్లడించారు.
నెటిజన్లు బాధ్యతగా మెలగాలి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ధ్రువీకృత సమాచారాన్ని మాత్రమే వెల్లడించాలని..లేకుంటే ప్రజల్లో ఆందోళన నెలకొంటుందని ఉపరాష్ట్రపతి అన్నారు. మహ మ్మారికి సంబంధించిన వివిధ అంశాలను లేవనెత్తడం ద్వారా, వాస్తవిక, విశ్లేషణాత్మక పద్ధతి లో ప్రచురించడం ద్వారా పార్లమెంటరీ సంస్థల చర్చల విషయంలో మీడియా ఒక అజెండాను సూచించిందన్నారు.