అమెరికా వెంటిలేటర్లు వచ్చేస్తున్నాయ్‌.. | US Set To Donate Ventilators To India | Sakshi
Sakshi News home page

విరాళంగా వెంటిలేటర్లు..

May 19 2020 6:23 PM | Updated on May 19 2020 6:26 PM

US Set To Donate Ventilators To India - Sakshi

భారత్‌కు చేరుకోనున్న అమెరికా వెంటిలేటర్లు

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19పై సమిష్టి పోరుకు పరస్పర సహకారం అందించే దిశగా భారత్‌కు 200 వెంటిలేటర్లను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించారు. తొలి విడతగా 50 వెంటిలేటర్లు త్వరలో భారత్‌కు చేరుకుంటాయని అమెరికన్‌ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. కంటికి కనిపించని కరోనా శత్రువుతో పోరాటంలో భారత్‌కు సహకరించేందుకు అమెరికా వెంటిలేటర్లను పంపిస్తుందని గత వారం ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్‌కు పంపే వెంటిలేటర్లు విరాళంగా పంపుతామని దీనిపై ఎలాంటి మొత్తం వసూలు చేయబోమని యూఎస్‌ఎయిడ్‌ తాత్కిలిక డైరెక్టర్‌ రమొన హంజోయ్‌ స్పష్టం చేశారు.

అమెరికా, అమెరికన్ల తరపున భారత్‌ సహా పలు దేశాలకు యూఎస్‌ఎయిడ్‌ వెంటిలేటర్లు, మందులను ఉదారంగా సరఫరా చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ వెంటిలేటర్ల రవాణా, డెలివరీలకు సంబంధించి తాము భారత వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ, రెడ్‌క్రాస్‌ సొసైటీలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. తక్షణం అవసరమైనవారికి వైద్య సేవలు అందించే క్రమంలో భారత్‌కు తోడ్పాటును అందించేందుకు వెంటిలేటర్లను విరాళంగా పంపుతున్నామని అన్నారు.

చదవండి : 3000 మంది ఉబర్‌ ఉద్యోగులపై వేటు

Advertisement
 
Advertisement
Advertisement