ఏపీకి తప్పకుండా న్యాయం జరుగుతుంది

Union Budget 2020 AP Will Definitely Get Justice Says Prakash Javadekar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అన్నారు. జమ్మూకాశ్మీర్‌, ఆంధ్రప్రదేశ్‌ రెండూ వేరువేరు అంశాలన్నారు. ఆర్టికల్ 371 రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌ను యూటిగా చేశామని పేర్కొన్నారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ చాలా బాగుందన్నారు. ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఈ దశబ్దానికి తొలి బడ్జెట్‌ అంటూ కొనియాడారు.  కేంద్ర బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. బ్యాంక్ డిపాజిట్లపై ఇచ్చే భీమాను రూ. 5లక్షలకి పెంచడం సామాన్యులకు ఇచ్చిన బహుమతిగా పేర్కొన్నారు. 
(బడ్జెట్‌ 2020 : కేంద్ర బడ్జెట్‌ హైలైట్స్‌)

చదవండి : కేంద్రం మొండిచేయి చూపింది: విజయసాయి రెడ్డి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top