నిఖార్సుగా కోర్సు..

UGC Revised Degree And PG Syllabus Based On Learning Outcomes Based Curriculum Framework - Sakshi

డిగ్రీ, పీజీ కోర్సుల ప్రక్షాళన

విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి లక్ష్యంగా యూజీసీ సంస్కరణలు

నమూనా కరిక్యులమ్‌ తయారీ

16 కోర్సుల్లో మార్పులకు శ్రీకారం

వచ్చే ఏడాది నుంచి అమలు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కోర్సుల్లో సమూల మార్పులకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు లెర్నింగ్‌ ఔట్‌కమ్స్‌ బేస్డ్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను (ఎల్‌వోసీఎఫ్‌) రూపొందించింది. అందుకు అనుగుణంగా సిద్ధం చేసిన మోడల్‌ కరిక్యులమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. డిగ్రీ, పీజీలో వివిధ కోర్సుల కాంబినేషన్లలో మార్పులు తీసుకువచ్చింది. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ కరిక్యులమ్‌ను సిద్ధం చేసింది. ప్రతి విద్యా సంస్థ సమాజం, పరిశ్రమలతో కచ్చితంగా అనుసంధానమై ఉండేలా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని యూనివర్సిటీల నుంచి అభిప్రాయాలను స్వీకరించి దీనిని రూపొందించింది. వాస్తవానికి 2019–20 విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తేవాలని భావించినా సాధ్యం కాకపోవడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కరిక్యులమ్‌ను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన లేదు. తమ రాష్ట్రాల్లో అందిస్తున్న కోర్సుల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగున్నాయనుకుంటే వాటినే కొనసాగించే సదుపాయం ఉంది. ఒకవేళ మార్పులు చేసుకోవాలనుకుంటే ఈ మోడల్‌ కరిక్యులమ్‌కు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. 

50% మందికి ఉపాధి లక్ష్యంగా.. 
దేశంలో 2022 నాటికి డిగ్రీ, పీజీ కోర్సులు చేసే విద్యార్థుల్లో కనీసంగా 50% మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చేయడమే లక్ష్యంగా ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థుల చదువులకు పారిశ్రామిక రం గంతో అనుసంధానం చేసేలా వాటిని రూపొందించింది. తద్వారా చదువుకునే సమయాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ఉపాధి, స్వయం ఉపాధిని పొందేలా చూసే లక్ష్యంతో కరిక్యులమ్‌ను రూపొందించింది. విద్యార్థులకు తప్పనిసరిగా అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలు, టీమ్‌వర్క్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, లీడర్‌షిప్‌ క్వాలిటీస్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ను నేర్పించేలా ఈ మార్పులు తీసుకువచి్చంది. వీటితోపాటు మానవ విలువలు, ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌ కూడా నేర్చుకోవడాన్ని కోర్సుల్లో భాగం చేసింది. మరోవైపు ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడేలా కోర్సుల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. 

ప్రతి అంశానికీ నిర్ణీత క్రెడిట్స్‌.. 
లెరి్నంగ్‌ ఔట్‌కమ్స్‌ బేస్డ్‌ కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను డిగ్రీ, పీజీల్లో 16 రకాల కోర్సుల్లో రూపొందించింది. ఫిజిక్స్, ఇంగ్లి‹Ù, మ్యాథమెటిక్స్, బోటనీ, ఆంత్రోపాలజీ, హ్యూమన్‌ రైట్స్, క్రిమినాలజీ, సైకాలజీ, లైబ్రరీ సైన్స్, ఎల్రక్టానిక్‌ సైన్స్, హిందీ, స్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మార్పులు చేసింది. అలాగే పోస్టు గ్రాడ్యుకేషన్‌లోనూ ఆయా కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్‌లో మార్పులు చేసింది. ఉదాహరణకు పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఆంత్రోపాలజీలో విద్యార్థులకు పక్కాగా బేసిక్‌ కాన్సెప్‌్ట, ప్రొసీజరల్‌ నాలెడ్జ్, స్పెషలైజ్డ్‌ స్కిల్స్‌ కచి్చతంగా ఉండేలా దీనిని రూపొందించింది. వాటితోపాటు ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ అప్రాప్రియేట్‌ ఇష్యూస్, ప్రాబ్లం సాలి్వంగ్‌ స్కిల్స్, ఇన్వెస్టిగేషన్‌ స్కిల్స్, ఐసీటీ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ప్రొఫెషనల్, ఎథికల్‌ బిహేవియర్, ఇండస్ట్రీ ఎక్స్‌పీరియన్స్‌ కూడా నేర్చుకునేలా దీనిని రూపొందించింది. అందుకు అనుగుణంగా క్రెడిట్స్‌ ఇవ్వాలని పేర్కొంది. మొత్తంగా డిగ్రీలో 148 క్రెడిట్స్‌ ఉండేలా చర్యలు చేపట్టాలని, అందులో ప్రధాన సబ్జెక్టులతోపాటు ప్రతి అంశానికీ నిరీ్ణత క్రెడిట్స్‌ ఇచ్చేలా కోర్సుల వారీగా పరీక్షల విధానాన్ని పొందుపరిచింది. 

ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి సూచన.. 
ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి విద్యా సంస్థలో విద్యార్థులకు బోధించే అధ్యాపకుల ఖాళీలు 10 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని పేర్కొంది. సమాజంలో వస్తున్న మార్పులు, పారిశ్రామిక రంగంలో పురోగతిని అధ్యాపకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ విద్యార్థులకు అందించాలని వెల్లడించింది. 2022 నాటికి దేశంలోని ప్రతి విద్యా సంస్థ కనీసం 2.5 స్కోర్‌తో నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొంది ఉండాలని పేర్కొంది. 

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం... 
యూజీసీ జారీ చేసిన మోడల్‌ కరిక్యులమ్‌ను పరిశీలించాక ఉన్నత స్థాయిలో చర్చించి ముందుకు సాగుతాం. మోడల్‌ కరిక్యులమ్‌లో పేర్కొన్న కోర్సులు, మార్పులు, తెలంగాణలో ఉన్న కోర్సులను పరిశీలించి అవసరమైన వాటిని పరిశీలిస్తాం. అవసరం అనుకుంటే తగిన మార్పులు చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. 
–-ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్, డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top