ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మావోల మృతి | Two Maoists killed in encounter with security forces in sukma district | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు మావోల మృతి

Sep 18 2017 12:57 PM | Updated on Oct 9 2018 2:53 PM

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.

రాయిపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. జిల్లాలోని సన్‌తోంగ్‌ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రీ, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement