గిన్నీస్‌ రికార్డు జల్లికట్టులో తీవ్ర విషాదం | Two Died In Jallikattu Event In Tamilnadu | Sakshi
Sakshi News home page

గిన్నీస్‌ రికార్డు జల్లికట్టులో తీవ్ర విషాదం

Jan 20 2019 7:34 PM | Updated on Jan 20 2019 7:53 PM

Two Died In Jallikattu Event In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై : గిన్నీస్‌ బుక్‌ రికార్డు కోసం అధికారులు ఏర్పాటు చేసిన అతిపెద్ద జల్లికట్టులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పుదుకొట్టై జిల్లా విరాళీమలైలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో  ఇద్దరు మృతి చెందారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గిన్నీస్‌ రికార్డులో చోటు సంపాదించగా.. 41మంది గాయపడ్డారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 21 ఎద్దులను పట్టుకుని తిరుచ్చికి చెందిన మురుగానందం మొదటిస్థానంలో, పదహారు ఎద్దులను పట్టుకుని కాట్టురుకు చెందిన కార్తీ రెండో స్థానంలో నిలుచున్నాడు. పలు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన ఈ జల్లికట్టు కార్యక్రమంపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement