కాలేజీ స్టూడెంట్‌తో మహిళ అసభ్య ప్రవర్తన

Train Fight In Mumbai Woman Tears Young Lady Dress Held For Molestation - Sakshi

దుస్తులు చింపేసి.. అవమానం

ముంబై : రైలు దిగే సమయంలో మొదలైన గొడవ ఓ మహిళను కటకటాలపాలు చేయగా.. మరో యువతిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ ఘటన ముంబైలోని కాందివళి రైల్వే స్టేషన్‌లో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మలద్‌ ప్రాంతానికి చెందిన యువతి (20) సోమవారం కాలేజీకి బయల్దేరింది.  ఉదయం 8 గంటల ప్రాంతంలో కాందివళి స్టేషన్‌లో రైలు దిగింది. అయితే, అదే సమయంలో రైలు దిగుతున్న ఓ మహిళా చేపల వ్యాపారి (38) సదరు యువతిని తోసుకుంటూ రైలు దిగేసింది.

దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈక్రమంలో యువతిపట్ల అనుచితంగా ప్రవర్తించిన మహిళ.. అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగింది. అంతటితో ఆగకుండా యువతి దుస్తులు చింపి.. దుర్భషలాడింది. సహాయం కోసం యువతి కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న పెట్రోలింగ్‌ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. అసభ్యంగా మట్లాడటమే కాకుండా.. దుస్తులు చింపి తనను వేధింపులకు గురిచేసిందని బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను స్టేషన్‌కు తరలించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top