పార్టీని బలోపేతం చేయండి! | To strengthen the party -modi | Sakshi
Sakshi News home page

పార్టీని బలోపేతం చేయండి!

Aug 8 2014 2:23 AM | Updated on Mar 29 2019 9:24 PM

పార్టీని బలోపేతం చేయండి! - Sakshi

పార్టీని బలోపేతం చేయండి!

దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీలకు ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు.

పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఎంపీల భేటీలో మోడీ పిలుపు
 
న్యూఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీలకు ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలతో గురువారం ఆయన తన నివాసంలో అనధికార భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరుపై నియోజకవర్గాల్లో ప్రజాస్పందనను ఎంపీలను అడిగి తెలుసుకున్నారు.

విపక్షాల దుష్ర్పచారాన్ని పట్టించుకోకుండా ప్రజాసేవకు అంకితమవ్వాలని వారిని కోరారు. పార్లమెంటు సమావేశాల తరువాత నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు పార్టీని విస్మరించకూడదని, పార్టీ లేకుంటే మనం లేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితబోధ చేశారు.  ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాలని ఎంపీలను కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement