పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుల మృతి
Mar 24 2017 2:17 PM | Updated on Oct 9 2018 2:53 PM
	రాంచీ:  జార్ఖండ్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పులు శుక్రవారం మహమ్మద్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సిట్‌చువా గ్రామంలో జరిగాయి. మృత దేహాలను స్వాధీనం చేసుకొని, ఒకరిని అజయ్ యాదవ్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. అజయ్‌పై రూ.10 లక్షల రివార్డు ఉందని చెప్పారు. వీరి వద్ద నుంచి ఒక ఏకే-47 తుపాకీ, ఏడు రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
