‘నీళ్లు అడుగుతున్న ఉడత’

Thirsty Squirrel Asking For Water Video Goes Viral Melts Hearts - Sakshi

చిట్టి ఉడత ఓ అబ్చాయిని నీళ్లు అడుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందుకు సంబంధించి వీడియోను సుశాంత్‌ నందా అనే ఆటవీ అధికారి శుక్రవారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నీళ్లు అడుగుతున్న ఉడత’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియోలో ఉడత తన వెనక కాళ్లపై నిలుచుని నీళ్లు అడుగుతున్న వీడియో ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటోంది. దాహంతో ఉన్న ఆ చిట్టి ఉడత రోడ్డుపై వెళుతున్న అబ్బాయి చేతిలో వాటర్‌ బాటిల్‌ చూసింది. (చదవండి: ఎమోజీ డే: భావాలెన్నో పలికించొచ్చు!)

అతడి వెనకాలే పరిగెత్తి రెండు కాళ్లపై నిలుచుని నీళ్లు కావాలంటూ దీనంగా ముందు కాళ్లు చాచింది. ఆ తర్వాత అబ్బాయి బాటిల్‌ మూత తీసి ఉడత నోటికి అందించడంతో గటగటా తాగేసి దాని దారిన అది వెళ్లిపోయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్‌ వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఇది చూసిన నిర్మాత నీలా నందా స్పందిస్తూ.. ‘ఈ వీడియో చూసి నా గుండె బరువెక్కింది. దీని లాగే నీళ్ల కోసం, ఆహారం కోసం అలమటించే మనుషులు జంతువులు చాలా వరకు ఉండొచ్చు. ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేసింది’ అంటూ రీట్వీట్‌ చేశారు. (చదవండి: ఫేక్‌ అకౌంట్లతో విద్యార్థినుల నగ్న చిత్రాలు..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top