ఆర్టీసీ బస్సును తగలబెట్టిన మావోయిస్టులు | The Maoists fired RTC bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును తగలబెట్టిన మావోయిస్టులు

Nov 23 2015 4:06 PM | Updated on Oct 9 2018 2:51 PM

ఆర్టీసీ బస్సును తగలబెట్టిన మావోయిస్టులు - Sakshi

ఆర్టీసీ బస్సును తగలబెట్టిన మావోయిస్టులు

ప్రయాణికులతో వెళ్తున్న బస్సును అడ్డుకున్న మావోలు ప్రయాణికులను కిందకు దించి బస్సుకు నిప్పంటించారు.

ప్రయాణికులతో వెళ్తున్న బస్సును అడ్డుకున్న మావోలు ప్రయాణికులను కిందకు దించి బస్సుకు నిప్పంటించారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా కాటేకళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాతం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామంలోని రాజీవ్ గాంధీ సేవా కేంద్రం సమీపంలో కాటేకళ్యాణ్ నుంచి దంతెవాడ వస్తున్న బస్సును సుమారూ 60 మంది మావోలు అడ్డుకున్నారు. అందరూ ప్రయాణికులను కిందకు దించి బస్సుకు నిప్పంటించారు. అనంతరం డ్రైవర్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసుకొని వెళ్లిపోయారు.



 

Advertisement
 
Advertisement
Advertisement