ఇంగ్లిష్ మార్కులను పరిగణించం | The government statement on Civils | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్ మార్కులను పరిగణించం

Aug 17 2014 1:28 AM | Updated on Sep 22 2018 7:37 PM

ఇంగ్లిష్ మార్కులను  పరిగణించం - Sakshi

ఇంగ్లిష్ మార్కులను పరిగణించం

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన సెంకడ్ పేపర్‌లో ఇంగ్లిష్ భాషా అవగాహనా నైపుణ్యాలకు సంబంధించిన మార్కులను అభ్యర్థుల ఉత్తీర్ణత లెక్కింపులో పరిగణనలోకి తీసుకోబోమని ప్రభుత్వం శనివారం ప్రకటించింది.

సివిల్స్ ప్రిలిమ్స్ పై ప్రభుత్వం ప్రకటన

న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన సెంకడ్ పేపర్‌లో ఇంగ్లిష్ భాషా అవగాహనా నైపుణ్యాలకు సంబంధించిన మార్కులను అభ్యర్థుల ఉత్తీర్ణత లెక్కింపులో పరిగణనలోకి తీసుకోబోమని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 24నే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ పరీక్షలో అంతర్భాగమైన ఇంగ్లిష్ భాషా అవగాహనా నైపుణ్యాల (పదవ తరగతి స్థాయిలోనివి) విభాగాన్ని పరిగణనలోకి తీసుకోబోమని, అందువల్ల ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు రాయవలసిన అవసరంలేదని అభ్యర్థులు గమనించాలని ఒక ప్రకటనలో తెలిపారు.

 పరీక్షలో పేపర్-2కు 200మార్కులను, రెండు గంటల వ్యవధిని కేటాయించారు. పేపర్-2 పరీక్ష వ్యవధి 2గంటలు యథాతథంగా ఉంటుందని, ఇంగ్లిష్ భాషా అవగాహనా నైపుణ్యాల విభాగం మినహా మిగతా ప్రశ్నలకు జవాబులు రాయడానికి అభ్యర్థులు ఈ మొత్తం వ్యవధిని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. కాగా,  యూపీఎస్‌సీ కొత్త చైర్‌పర్సన్‌గా రజనీ రజ్దాన్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement