బుద్గాం ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం | Terrorist killed in an encounter in Budgam | Sakshi
Sakshi News home page

బుద్గాం ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

Mar 29 2017 3:11 AM | Updated on Sep 5 2017 7:20 AM

బుద్గాం ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

బుద్గాం ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం

కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ముష్క రులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి.

- ఆ సమయంలో బలగాలపై రాళ్లు రువ్విన స్థానికులు
- కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి..18 మందికి గాయాలు


శ్రీనగర్‌: కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ముష్క రులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌ సమయంలో ఉగ్రవాదులకు సాయంగా జవాన్లపై స్థానికులు రాళ్లతో దాడిచేశారు. దీంతో భద్రతా దళాలు వారిపైనా కాల్పులు జరిపాయి. దీంతో ఒక ఉగ్రవాది, ముగ్గురు పౌరులు చనిపోయారు. మంగళవారం ఉదయం చదూరాలో ఉగ్రవాదులు ఉన్నారని తెలిసి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి.

ఆ సమయంలో హఠాత్తుగా ఉగ్రవాదుల నుంచి కాల్పులు మొదలయ్యాయి. దీంతో జవాన్లు సైతం ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇదేసమయంలో ఉగ్రవాదులను తప్పించేం దుకు స్థానిక యువకులు.. జవాన్లపై రాళ్లతో విరుచుకుపడ్డారు. దీంతో వారిపైనా జవాన్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. మరణించిన స్థానికులను జహీద్‌ డర్, సాకీబ్‌ అహ్మద్, ఇష్ఫక్‌ అహ్మద్‌వానిగా గుర్తించారు. ఇదే ఘటనలో మరో 18 మంది గాయపడ్డారు. భద్రతా దళాలు అమాయక ప్రజల ప్రాణా లను బలిగొన్నందుకు నిరసనగా వేర్పాటువా దులు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement