తెలుగు ప్రజల వారధి | Telugu people Bridge | Sakshi
Sakshi News home page

తెలుగు ప్రజల వారధి

Dec 31 2016 4:02 AM | Updated on Sep 4 2017 11:58 PM

తెలుగు ప్రజల వారధి

తెలుగు ప్రజల వారధి

తెలంగాణలో కాళేశ్వ రం–మహారాష్ట్రలోని సిరొంచ, అంకీస, ఆసరెల్లి ప్రజలు రాకపోకలు సాగించేందుకు నాటు పడవలను ఆశ్రయించాల్సిన ఇబ్బంది తొలగిపోయింది.

- గోదావరిపై మరో వంతెన ప్రారంభం
- తెలంగాణ– మహారాష్ట్రల అనుసంధానం

సాక్షి, భూపాలపల్లి: తెలంగాణలో కాళేశ్వ రం–మహారాష్ట్రలోని సిరొంచ, అంకీస, ఆసరెల్లి ప్రజలు రాకపోకలు సాగించేందుకు నాటు పడవలను ఆశ్రయించాల్సిన ఇబ్బంది తొలగిపోయింది. గోదావరిపై నిర్మించిన వంతెన శుక్రవారం ప్రారంభమైంది. మహా రాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌లతోపాటు తెలంగాణ రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఈ ప్రారంభోత్స వంలో పాల్గొన్నారు.  సభలో ‘తెలంగాణ నాజన్మభూమి అయితే, మహారాష్ట్ర నా కర్మభూమి’అని మహరాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు.  కేంద్ర రవా ణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ సిరొంచ తాలూకా ఇసుక క్వారీలతో రూ.5 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశామన్నారు.

మేడిగడ్డతో నష్టం లేదు: ఫడ్నవీస్‌
తెలంగాణ నిర్మించతలపెట్టిన మేడిగడ్డ బ్యారేజీ వల్ల సిరొంచ తాలూకాలో ఒక్క గ్రామం, ఒక్క ఇల్లు కూడా ముంపునకు గురి కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ రైతులకు హామీ ఇచ్చారు. తెలంగాణ వ్యక్తి మహారాష్ట్ర గవర్నర్‌గా ఉండటం వల్ల మేడి గడ్డ బ్యారేజీ నిర్మాణం కల సాకా రమవుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement