సుజనా చౌదరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు | TDP MP Sujana chowdary got cabinet ministry | Sakshi
Sakshi News home page

సుజనా చౌదరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు

Nov 8 2014 8:22 AM | Updated on Sep 2 2018 5:11 PM

సుజనా చౌదరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు - Sakshi

సుజనా చౌదరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు

కేంద్రమంత్రివర్గ విస్తరణ, పునర్వ్యస్థీకరణలో భాగంగా టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి కేబినెట్లో బెర్త్ ఖరారు అయ్యింది.

న్యూఢిల్లీ : కేంద్రమంత్రివర్గ విస్తరణ, పునర్వ్యస్థీకరణలో భాగంగా టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి కేబినెట్లో బెర్త్ ఖరారు అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని సుజనాకు తెలియచేసినట్లు సమాచారం.  ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణలో కేంద్రమంత్రిగా సుజనా చౌదరి  ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కాగా గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన పేరును ప్రధాని కార్యాలయానికి పంపారు. అయితే సుజనాకు సహాయ మంత్రి పదవి ఇస్తామని ప్రధాని ప్రతిపాదించారని, కాగా తమకు స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవి కావాలని టీడీపీ కోరినట్లు సమచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement