‘కియా’తో సంప్రదింపులు జరుపలేదు: తమిళనాడు

Tamil Nadu Govt Reaches Out To AP Govt On KIA Issue - Sakshi

సాక్షి, చెన్నై: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తమిళనాడుకు తరలిపోతుందన్న ప్రచారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తాము కియా యాజమాన్యంతో టచ్‌లో లేమని.. వారితో ఎటువంటి సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ మేరకు తమిళనాడు పరిశ్రమల ప్రధాన కార్యదర్శి.. ఏపీ పరిశ్రమల కార్యదర్శికి ఫోన్‌ చేసి మాట్లడినట్లు సమాచారం. కాగా కియా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిస్తున్నారంటూ రాయిటర్స్‌ పేర్కొన్న కథనాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించిన విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని.. కియా మోటార్స్‌- ప్రభుత్వం కలిసే పని చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ స్పష్టం చేశారు. అదే విధంగా కియా మోటర్స్‌ సైతం రాయిటర్స్‌ కథనాన్ని ఖండించింది.(అందుకే ‘కియా’ తరలింపు అంటూ టీడీపీ దుష్ప్రచారం..)

(రాయిటర్స్‌ కథనాన్ని ఖండించిన ఏపీ ప్రభుత్వం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top