కోర్టులకు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత? | Supreme Court seeks CISF cadre for security inside courts | Sakshi
Sakshi News home page

కోర్టులకు సీఐఎస్‌ఎఫ్‌ భద్రత?

Jan 9 2020 6:15 AM | Updated on Jan 9 2020 6:15 AM

Supreme Court seeks CISF cadre for security inside courts - Sakshi

న్యూఢిల్లీ: హింసాత్మక ఘటనలను నివారించేందుకు కొన్ని న్యాయస్థానాల్లో ప్రత్యేక తరగతికి చెందిన సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లతో భద్రత ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు  కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టులో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్‌ ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. గత నవంబరులో జరిగిన ఈ ఘటనలో న్యాయవాదులు, పోలీసులు పరస్పరం దాడులకు దిగిన విషయం తెలిసిందే. చీఫ్‌ జస్టిస్‌ నిర్ణయం తరువాత ప్రత్యేక సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లను ఏర్పాటు చేసే అంశాన్ని చేపట్టాలని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌లు సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు తెలిపారు. జవాన్ల ఏర్పాటు న్యాయవాదులకు ఇబ్బందికరం కావచ్చునని  ఈ కేసుకు సంబంధించి కోర్టుకు సహాయపడుతున్న సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement