విక్స్‌ యాక్షన్, డీకోల్డ్‌లపై పునఃపరిశీలన

Supreme Court for relook into 349 fixed-dose combination medicines by drug advisory board - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు నిషేధం ఎత్తేసిన విక్స్‌ యాక్షన్‌ 500, డీకోల్డ్‌ లాంటి ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌(ఎఫ్‌డీసీ) మందులను పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బాధ్యతను డ్రగ్స్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డు(డీటీఏబీ)కు అప్పగించాలని కోర్టు కేంద్రానికి సూచించింది. కోరెక్స్‌ దగ్గు మందు, క్రోసిన్‌ కోల్డ్, విక్స్‌ యాక్షన్‌ 500 ఎక్స్‌ట్రా, డీకోల్డ్, సారిడాన్, అస్కోరిల్, అలెక్స్‌ దగ్గు మందు, ఫెన్సెడిల్‌ దగ్గు మందు, గ్లెకోడిన్‌ దగ్గు మందు లాంటి ఔషధాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాలుచేస్తూ కేంద్రం దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. ఎఫ్‌డీసీల వాడకంతో మనుషులు, జంతువులకు ముప్పు ఉందంటూ కేంద్రం వాటిని 2016లో నిషేధించగా,డిసెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top